Viral: అత్యంత ఎత్తైన భవనంపైనున్న యాంటినాపై యువకుడు నిలబడి.. షాకింగ్ వీడియో!
ABN , Publish Date - Aug 01 , 2024 | 07:42 PM
సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావాలన్న తపనతో ఓ యువకుడు ఊహించని స్టంట్ చేశాడు. న్యూయార్క్ నగరంలో భారీ భవనంగా పేరుపడ్డ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పైనున్న యాంటీనాపైకి ఎక్కి సెల్ఫీ వీడియో రికార్డు చేశారు. దీనికి భారీగా వ్యూస్ వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా క్రేజ్‌లో పడిన యువత వ్యూస్ లైక్స్ కోసం ఎంతటి రిస్క్‌కుకైనా వెనకాడటం లేదు. ఒకొక్కరూ ఒక్కో స్టంట్‌తో జనాలను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజుకో వెరైటీ స్టంట్‌తో నెటిజన్లను హడలెత్తించేస్తున్నారు. ఈ ప్రయత్నంలో కొందరు మాత్రమే సక్సెస్ సాధించి పాప్యులర్ అవుతున్నారు. అధిక శాతం మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు తాము ప్రమాదాల్లో పడటమో లేదా ఇతరులను ప్రాణాపాయంలోకి నెట్టడమో చేస్తున్నారు. కొత్తగా సోషల్ మీడియాలో అడుగుపెట్టేవారు ఇదంతా చూస్తున్నా కూడా స్టంట్‌లు చేసేందుకు వెరవట్లేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. నెట్టింట తాజాగా మరో భయానక వీడియో ట్రెండింగ్‌లో (Viral) ఉంటూ నెటిజన్లను షేక్ చేస్తోంది.
Viral: వీడియో కాల్‌లో ఇంటర్వ్యూ! ఉద్యోగార్థి చేసిన పనికి కంపెనీ యజమానికి షాక్!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ యువకుడు న్యూయార్క్ నగరంలో అత్యంత భయానక స్టంట్ చేశాడు. అత్యంత ఎత్తైన ఎంపైర్ స్టేట్ భవనంపై ఉన్న యాంటీనాను ఎక్కి సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అత్యంత ప్రమాదకరంగా యాంటీనాపై తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియో రికార్డు చేసుకున్నాడు. ఇక వీడియో నెట్టింట బాట పట్టి సంచలనంగా మారింది. జనాలు నోరెళ్ల బెట్టేలా చేస్తోంది (Video of mans daring stunt on top of Empire State Building has 49 million views).
జనాలను విపరీతంగా వణికిస్తున్న ఈ వీడియోకు ఏకంగా 4.8 కోట్ల వరకూ వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన వారందరూ యువకుడిపై ప్రశంసలుకురిపిస్తూనే ఇంతటి రిస్క్ అవసరమా అని ప్రశ్నించారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటేనే ఒళ్లంతా చెమటలు పట్టేస్తోందని ఓ వ్యక్తి అన్నాడు. మతి పోగొట్టే స్టంట్ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. కొందరు మాత్రం యువకుడిని తిట్టిపోశారు. వ్యూస్ కోసం జీవితాలను పణంగా పెట్టడం అవసరం లేదని కొందరు అన్నారు. ఇతడికి బతుకంటే భయంలాగుంది.. జీవితాన్ని పణంగా పెట్టి మరీ స్టంట్లు చేస్తున్నాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కాగా, నెబ్రాస్కాలో ఓ టీనేజర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఏకంగా రైలునేు పట్టాలు తప్పించాడు. నెబ్రాస్కాలో జరిగిన ఈ ఘటనలో రైలు మార్గం మళ్లించే ఓ స్విచ్ఛ్‌ను అతడు తప్పుగా వేయడంతో రైలు పట్టాలు తప్పి నిలిపి ఉంచిన బోగీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం లేనప్పటికీ 3.5 లక్షల డాలర్ల మేర ఆస్తినష్టం సంభవించింది. ఈ ఘటనకు కారణమైన టీనేజర్‌పై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారు.