Viral: వావ్.. దోస ప్రింటింగ్ మెషీన్! ఆనంద్ మహీంద్రా ఫిదా!
ABN , Publish Date - Nov 14 , 2024 | 05:03 PM
ఓ వీధి వ్యాపారి వద్ద ఉన్న దోసల యంత్రం చూసి ఆనంద్ మహీంద్రా అబ్బురపడ్డారు. ఆయన రీపోస్టు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: దోసలు వేయడం ఓ కళ. దోసలు అద్భుతంగా వేసే వారిని వ్యావహారికంలో దోస మాస్టర్ అని అంటుంటారు. ఇది అందరికీ అబ్బే టాలెంట్ కాదు. అయితే, ఆధునిక సాంకేతికత కారణంగా మనుషులు చేసే అనేక పనులను అంతే చాకచక్యంగా యంత్రాలు చేసిపెడుతున్నాయి. అలాంటి ఓ మెషిన్‌ను చూసి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. ఈ దోసల ప్రింటింగ్ యంత్రం అద్భుతమంటూ ఆయన షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Viral: ఎంత మోసం.. మంచానపడ్డ భర్తకు సేవలు చేసి కోలుకునేలా చేస్తే..
వీధి పక్కన ఉన్న ఓ టిఫిన్ బండిలో ఉన్న ఈ మెషీన్ తాలూకు వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. దోసలను గుండ్రంగా, చక్కని రంగులో వేసేందుకు ఎంతో నైపుణ్యం అవసరం. అంతటి క్లిష్టమైన పనిని ఈ మెషీన్ చిటికెలో వేసేసింది. ముఖ్యంగా దోసలు వేసే వ్యక్తి గంటల తరబడి పొయ్యి ముందు గడపాల్సిన అవసరం లేకుండా ఈ యంత్రం చేసింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తొలుత ఓ వ్యక్తి .. యంత్రంపై ఉన్న పెనంపై దోస పిండిని గరిటెతో వేశాడు. ఆ తరువాత యంత్రంలోని రోలర్ ఆటోమేటిక్‌గా దీన్ని గుండ్రని ఆకారంలో పెనంపై పరిచింది. ఆపై దోస చక్కని రంగులోకి వచ్చేలా కాలాక దాన్ని సునాయసంగా తీసి వ్యక్తికి అందించింది. ఎంత మంది కస్టమర్లు వచ్చినా ఆలస్యం లేకుండా దోసలు రెడీ చేసి ఇచ్చే ఈ యంత్రం మహీంద్రాను బాగా ఆకట్టుకోవడంతో ఆయన దీన్ని రీ పోస్టు చేశారు. ది డెస్క్‌టాప్ యంత్రం అంటూ ఓ సరదా కామెంట్ కూడా చేశారు.
Viral: జపాన్ వీధుల పరిశుభ్రతను పరీక్షించిన భారతీయ యువతి! రిజల్ట్స్ చూసి షాక్
వాస్తవానికి ఇప్పటికే మార్కెట్లో అనేక దోస మేకింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని యంత్రాలతో దోస వేసేందుకు మనుషుల సాయం అవసరం కాగా కొన్ని మాత్రం తమంతట తామే అన్ని పనులు చేస్తాయి. పెనంపై పిండి పరచడం మొదలు, దాన్ని అటూ ఇటూ బాగా కాలేలా తిప్పడం ఆ తరువాత దాన్ని తీసి రౌండ్‌గా చుట్టి ప్లేట్‌లో పడేయడం వరకూ అన్నీ మెషీన్ చూసుకుంటుంది. కొన్నింట్లో మాత్రం పిండి పరిచే పనులు మనుషులే చేయాల్సి ఉంటుంది. మరికొన్ని యంత్రాల్లో దోసను తిరగేసే పనిని మనుషులు చేస్తుంటారు. వ్యక్తుల అవసరాలను బట్టి రకరకాల సైజుల్లో, ఫీచర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇడ్లీలు వేసే యంత్రాలు కూడా అనేకం మార్కెట్లో ఉన్నాయి. యంత్రంలో పిండి వేసి ప్లేట్లు పెడితే చాలు.. మిగతా పనంతా అదే చేస్తుంది. ఇడ్లీలు పూర్తయ్యాక ప్లేట్‌ను బయటకు తోస్తుంది. నెట్టింట్లో ఇందుకు సంబంధించిన వీడియోలు అనేకం ఉన్నాయి.
Viral: పెళ్లిలో వధూవరులకు భారీ షాక్! మా తప్పేంటో చెప్పండంటూ ఆవేదన
Viral: ప్రసవ సమయంలో డాక్టర్ల పొరపాటు.. 18 ఏళ్లుగా మహిళకు నరకం