Share News

Viral: ఈ వైరస్ ఎయిర్ పోర్టులోనూ కాలుపెట్టింది.. ప్రధాని కల్పించుకోకతప్పదు.. వైరల్ వీడియో

ABN , Publish Date - May 30 , 2024 | 04:57 PM

ముంబై ఎయిర్ పోర్టులో ఓ యువతి షార్ట్ వీడియోల కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల అవుతోంది. ఈ వైరస్ ఎయిర్ పోర్టులోనూ కాలుపెట్టిందంటూ జనాలు మండిపడుతున్నారు.

Viral: ఈ వైరస్ ఎయిర్ పోర్టులోనూ కాలుపెట్టింది.. ప్రధాని కల్పించుకోకతప్పదు.. వైరల్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: జనాల్లో రీల్స్ పై మోజు విపరీతంగా పెరిగిపోతోంది. మెట్రో రైళ్లు, సాధారణ రైళ్లు, బస్ట్ స్టాండ్ లు ఇలా ఎక్కడపడితే అక్కడ యువత షార్ట్ వీడియోలు, రీల్స్ కోసం వెర్రి డ్యాన్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. పరిస్థితి నానాటికీ దిగజారుతూనే ఉందనేందుకు రుజువుగా ఓ మహిళ ఏకంగా ఎయిర్ పోర్టునే టార్గెట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ (Viral) అవుతూ జనాలకు తీవ్ర ఆగ్రహం కల్పిస్తోంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ముంబై ఎయిర్ పోర్టులో ఓ యువతి రీల్స్ పేరిట ఇష్టారీతిన రెచ్చిపోయింది. పైజామా, కుర్తా ధరించిన ఆమె అకస్మాత్తుగా డ్యాన్స్ మొదలెట్టింది. కిందపడి డొల్లుతూ రెచ్చిపోయింది. ఆమె డ్యాన్స్ తో అక్కడున్న వారికి ఇబ్బంది కలిగింది. కొందరేమో యువతి వైపు విచిత్రంగా చూశారు. ఆమె తీరుతో విసుగొచ్చినా మనకెందులే అనే ధోరణితో ఆమెను కాసేపు ఎగాదిగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోలేదు.

Viral: ఏఐ సాయంతో ఏకంగా షుగర్ వ్యాధినే జయించాడు..


ఇక నెట్టింట్లో ఈ వీడియోపై విమర్శలు ఓ రేంజ్ లో వెల్లువెత్తుతున్నాయి. ఈ వైరస్ ఎయిర్ పోర్టులో కూడా కాలుపెట్టిందంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలాంటి వారు పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని కొందరు మండిపడ్డారు. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తుండటంపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ల కట్టడికి కఠిన నిబంధలు శిక్షలు అవసరమని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు.

ఇలాంటి వారి కట్టడికి ప్రధాని రంగంలోకి దిగాలని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మద్య వీడియో వైరల్ గా మారింది.

ఇలాంటి వీడియోలు గతంలో కూడా వెలుగు చూసిన విషయం తెలిసిందే. కొందరు మహిళలు ముంబై రైళ్లలో డ్యాన్స్‌లు చేయడం అనేక మందికి ఆగ్రహం తెప్పించింది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Read Viral and Telugu News

Updated Date - May 30 , 2024 | 05:07 PM