Viral: కొబ్బరి చిప్పలో టీ తయారు చేసిన మహిళ.. చూసి తీరాల్సిన వీడియో
ABN , Publish Date - Jun 22 , 2024 | 10:21 PM
ఓ మహిళ.. కొబ్బరి చిప్పలో టీ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జనాలను ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ తాగని భారతీయుడు ఉండంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అందుకే టీపై ప్రయోగాలు కూడా అదే స్థాయిలో జరుగుతుంటాయి. టీకి కొత్త రుచి జోడించేందుకు అనేక మంది ప్రయత్నించి సోషల్ మీడియాలో వీడియోలు కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ మహిళ ఏకంగా కొబ్బరి చిప్పపై టీ తయారీ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ (Viral) అవుతోంది.
Viral: నా సంస్థలోని తొలి ఉద్యోగిని తీసేశానంటూ సీఈఓ పోస్టు! నెట్టింట విమర్శలు
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ మహిళ ముందుగా చిన్న మట్టి కుంపటిపై కొబ్బరి చిప్ప పెట్టింది. అందులో నీళ్లు పోసి మరిగించాక చక్కెర, టీ ఆకులు వేసి మళ్లీ మరిగించింది. ఆ తరువాత పాలు కూడా జత చేసింది. చివర్లో అల్లం, యాలకులు కూడా వేసి ఆ తరువాత దాన్ని టాంగ్స్‌తో పైకెత్తి చిన్న కప్పులో పోసింది (Video Of Woman Preparing Chai In Coconut Shell Impresses The Internet).
వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. టీ చేసే విధానం చూశాకా తమకు చిన్నతనం రోజులు గుర్తొచ్చాయని కొందరు అన్నారు. నీళ్లు, చక్కెర సమపాళ్లల్లో యాడ్ చేయడం మరికొందరిని ఆశ్చర్యపరిచింది. చెంచాలో పట్టేంత టీ చేయడం మరింత వింతగా ఉందని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.