Share News

Manmohan Singh Resume: మన్మోహన్ సింగ్ రెజ్యూమే నిజంగా స్ఫూర్తివంతం.. ప్రముఖ కమెడియన్ ప్రశంస..

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:18 PM

భారత దేశప్రజలందరూ మన్మోహన్ సింగ్ ప్రతిభాపాటవాలను గుర్తుచేసుకుంటున్న వేళ ప్రముఖ కమెడియన్ వీర్ దాస్.. మాజీ ప్రధాని రెస్యూమేను ప్రస్తావిస్తూ ఓ పోస్టు చేశారు. రెజ్యూమేలో మన్మోహన్ సింగ్ ప్రతిభాపాటవాలు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Manmohan Singh Resume: మన్మోహన్ సింగ్ రెజ్యూమే నిజంగా స్ఫూర్తివంతం.. ప్రముఖ కమెడియన్ ప్రశంస..

ఇంటర్నెట్ డెస్క్: ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దేశాన్ని 1991లో గాడిన పడేసిన ఆర్థికవేత్త డా. మన్మోహన్ సింగ్. ఆర్థికమంత్రిగా ఆయన బడ్జెట్ భారత గమనాన్ని మార్చేసింది. అనంతరం ప్రధానిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. యావత్ దేశాన్ని శోకసంద్రంలోని నెట్టి ఆయన గురువారం తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. దేశప్రజలందరూ ఆయన ప్రతిభాపాటవాలను గుర్తుచేసుకుంటున్న వేళ ప్రముఖ కమెడియన్ వీర్ దాస్.. మాజీ ప్రధాని రెజ్యూమేను ప్రస్తావిస్తూ ఓ పోస్టు చేశారు (Manmohan Singh).

‘‘ఒక్కసారి మీరందరూ డా. మన్మోహన్ సింగ్ రెజ్యూమేను గూగుల్ చేసి చూడండి. ముందు ఆయన విద్యార్హతలను మాత్రమే చూడండి. ఆ తరువాత మొత్తం రెజ్యూమేను పరీశీలించండి. ఆయన ప్రతిభ మీలో స్ఫూర్తిని రగిలిస్తుంది’’ అని కామెంట్ చేశారు.

Manmohan Singh: ఆర్థిక మార్గదర్శి అస్తమయం


చదువుకునే రోజుల్లో డా.మన్మోహన్ సింగ్ ఏస్థాయి ప్రతిభ కనబరిచారో ఈ రెజ్యూమే చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. దీంతో, నెటిజన్లు కూడా ఆయన ప్రతిభను కళ్లారా చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రతి దశలోనూ మన్మోహన్ సింగ్ ముందువరుసలో నిలిచారు. ఆర్థికరంగంలో కొత్త దారులు పరుస్తూ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. భారత దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 మధ్య సేవలందించారు. 1991 నాటి ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారత రూపశిల్పిగా పేరుగాంచారు.

RSS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంతాపం


మన్మోహన్ సింగ్ మృతిపై వివిధ దేశాల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను కూడా ప్రకటించింది. ఇక మన్మోహన్ సింగ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ గతకాలపు స్మృతులను గుర్తు చేసుకున్నారు. ‘‘ఆయన పీఎంగా ఉన్నప్పుడు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాను. పరిపాలనకు సంబంధించి వివిధ అంశాలపై మేమిద్దరం లోతుగా చర్చించేవాళ్లం. ఆయన మేధోసామర్థ్యం, వినయశీలత జగద్విదితం’’ అని పేర్కొన్నారు.

2.jpg3.jpg

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 27 , 2024 | 02:22 PM