Viral Video: చిన్న వయసులోనే చాలా విషయాలు తెలుసుకున్నాడు.. ఎగ్జామ్‌లో ఆ కుర్రాడు రాసింది చదివితే..
ABN , Publish Date - Nov 20 , 2024 | 07:26 AM
పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు కొందరు విద్యార్థులు రాసే ఫన్నీ సమాధానాలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో ఆన్సర్ షీట్లు వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో జవాబు పత్రం నెట్టింట హల్చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ఫన్నీగా, ఆసక్తికరంగా ఉండే వీడియోలు, పోస్ట్‌లను చాలా మంది ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పరీక్షల్లో (Exam) ప్రశ్నలకు కొందరు విద్యార్థులు (Student) రాసే ఫన్నీ సమాధానాలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో ఆన్సర్ షీట్లు వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో జవాబు పత్రం (Viral Answer Sheet) నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రశ్నాపత్రంలో ప్రేమను (Love) నిర్వచించాలని ప్రశ్న అడిగారు. దానికి ఆ విద్యార్థి తనదైన శైలిలో జవాబు చెప్పాడు (Viral Video).
kim_.taehyung అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పరీక్షలో ``ప్రేమను నిర్వచించండి`` అని ప్రశ్న అడిగారు. దానికి ఆ విద్యార్థి జవాబు రాస్తూ.. ``సార్ ప్రేమ, ఆప్యాయతలు అన్నీ మోసం. చదువుపై శ్రద్ధ పెట్టండి. ఇంకా అవకాశం ఉంది`` అంటూ తనదైన శైలిలో జవాబు రాశాడు. ఈ జవాబు చూసి టీచర్ షాకయ్యారు. ఆ కుర్రాడి ముందు చూపునకు ముగ్ధులై వందకు ఏకంగా వెయ్యి మార్కులు వేశారు. ఆ ఆన్సర్ షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.7 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ కుర్రాడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది``, ``చిన్న వయసులోనే అసలు విషయం తెలుసుకున్నాడు``, ``ఆ కుర్రాడి తెలివికి హ్యాట్సాఫ్``, ``ఓ మై గాడ్, అలాంటి సమాధానం కూడా రాయవచ్చని నాకు తెలియదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీ కళ్లకు సవాల్.. ఈ అడవిలో కప్ప ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..
Viral Video: మీరూ ఇలాంటి తప్పు చేయకండి.. ఆ కార్ డ్రైవర్ చేసిన పనికి ఏకంగా రూ.2.5 లక్షల జరిమానా..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి