Share News

Viral: ఇంటి బయట కూర్చున్న మహిళకు ఊహించని షాక్! సడెన్‌గా గోడపై నుంచి..

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:29 PM

ఇంటి బయట కుర్చీలో కూర్చున్న మహిళపై కోతులు అకస్మాత్తుగా దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కోతులు దాడి చేసిన తీరు చూసి జనాలు షాకైపోతున్నారు.

Viral: ఇంటి బయట కూర్చున్న మహిళకు ఊహించని షాక్! సడెన్‌గా గోడపై నుంచి..
Monkeys attack woman in Rajasthan

ఇంటర్నెట్ డెస్క్: జనావాసాలు విస్తరిస్తున్న కొద్దీ అడవులు తరిగిపోతున్నాయి. చివరకు అడవుల్లోని జంతువులు జనావాసాల వైపు వస్తున్నాయి. ఫలితంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

అజ్మీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రామ్‌నగర్ కాలనీలో ఉంటున్న ఓ మహిళ తన ఇంటి పెరట్లో కూర్చి వేసుకుని కూర్చుంది. అప్పటికే ఆ ప్రాంతంలో కోతుల మంద తిరుగుతోంది. ఈ క్రమంలో రెండు కోతులు మహిళను టార్గెట్ చేసుకున్నాయి.

Viral: ట్రాఫిక్ రద్దీ.. ఉబెర్‌కు బదులు హెలికాఫ్టర్‌లో మహిళ ప్రయాణం! చివరకు..


మహిళ తనపనిలో నిమగ్నమై ఉండగా ఓ కోతి ఆమె ఇంటి గోడపైకి ఎక్కింది. అక్కడి నుంచి కిందకు వంగి మహిళ జుట్టుపట్టుకుని లాగేసింది. ఏం జరగుతోందో, తన జుట్టును ఎవరు లాగుతున్నారో అర్థంకాక మహిళ టెన్షన్ పడిపోయింది. ఇంతలో రెండో కోతి కూడా వచ్చి ఆమెను జుట్టుపట్టుకుని లాగింది. దీంతో, ఆమె పెద్దపెట్టున అరిచింది. ఆ ఇంట్లో ఉన్న మరో వ్యక్తి మహిళ అరుపులు విని వెంటనే బయటకొచ్చాడు. ఆమె జుట్టు పట్టి లాగుతున్న కోతులను తరిమేశాడు (Viral Clip Of Monkeys Attack On Woman Will Send Chills Down Your Spine).

వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. కోతుల బెడత ఎక్కువైతే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయంటూ కామెంట్ చేశారు. పిల్లలకు కోతులతో మరింత ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 03:29 PM