Viral Video: తండ్రి, కూతుళ్ల డ్యాన్స్.. వీడియో చూసి వీక్షకుల పరేషాన్
ABN , Publish Date - Sep 27 , 2024 | 04:37 PM
ఓ తండ్రి పెళ్లి వేడుకల్లో తన కూతుళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వ్యక్తులు వారు తండ్రి, కూతుళ్లని అంచనా వేయలేకపోతున్నారు. ఆమె భర్త లేదా అన్నయ్య అయి ఉంటారని ఊహించారు. కానీ చివరకు..
నేటి సోషల్ మీడియా యుగంలో ఎన్నో చిత్ర, విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో చూసే ఫోటోలు, వీడియోల్లో వ్యక్తులను సరిగ్గా అంచనా వేయలేము. అలాంటి సంఘటన ఒకటి కేరళలో చోటుచేసుకుంది. ఓ తండ్రి పెళ్లి వేడుకల్లో తన కూతుళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వ్యక్తులు వారు తండ్రి, కూతుళ్లని అంచనా వేయలేకపోతున్నారు. ఆమె భర్త లేదా అన్నయ్య అయి ఉంటారని ఊహించారు. కానీ చివరకు వాళ్లు తండ్రి, కూతుళ్లని తెలియడంతో అంతా ఆశ్చర్యపోయారు.
ప్రభుదేవా ఐకానిక్ సాంగ్ 'ముకల ముకబాలా' సాంగ్‌కి డ్యాన్స్ వేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పెళ్లికూతురు సోదరుడా లేదా భర్తతో కలిసి డ్యాన్స్ వేస్తుందని అంతా ఊహించారు. కానీ వీడియో వ్యక్తి పెళ్లి కుమార్తె తండ్రి అని తెలియడంతో ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది.వీడియోలో ఉన్న వ్యక్తిని త్రిస్సూర్‌లోని చంత్రపిణికి చెందిన కొరోట్టు లాలూగా గుర్తించారు, అతని కుమార్తెలు దేవిక, అనామికతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
అమరావతి: APMDC మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్ట్
కుమార్తెలతో కలిసి..
లాలూ డ్యాన్స్ వీడియో వైరల్ కావడంపై స్పందిస్తూ తనను చూసి చాలామంది వయసులో చిన్నవాడిగా పొరబడతారని తెలిపాడు. డ్యాన్స్ వీడియోను చూసిన చాలామంది వీడియోలో ఉన్నది తన చెల్లిగా భావించారని, కానీ కుమార్తెలతో కలిసి డ్యాన్స్ చేసినట్లు చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారన్నారు. తనకు 22 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యిందని, 23 ఏళ్ల వయసులో మొదటి కుమార్తె పుట్టిందని, ప్రస్తుతం తన వయసు 46 సంవత్సరాలుగా లాలూ చెప్పాడు. లాలూ కుమార్తె దేవిక మాట్లాడుతూ.. తాను నాన్నతో కలిసి బయటకు వెళ్లినప్పుడు అంతా తన సోదరుడని అనుకుంటారని, ఆయన తండ్రి అని చెప్పడంతో నిజం చెప్పాలంటూ పదేపదే అడుగుతారని దేవిక తెలిపింది. వీడియో వైరల్ అయిన తర్వాత.. అలాంటి ప్రశ్నలు మరిన్ని ఎదురవుతున్నాయని దేవిక చెప్పింది. డ్యాన్స్‌లో అనుభవం ఉన్న లాలూ, డ్యాన్స్ పట్ల తనకున్న ఇష్టం గురించి మాట్లాడుతూ.. చిన్నతనంలోనే తాను ఎన్నో డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నట్లు తెలిపాడు. కొందరు పిల్లలు డ్యాన్స్ నేర్చుకునేందుకు ఒక టీచర్‌ని కూడా పెట్టుకున్నామని లాలూ పేర్కొన్నాడు. 647 వేదికలపై ప్రదర్శనలు ఇచ్చామన్నారు. తన కజిన్ డ్యాన్స్‌లో ఎంతో సపోర్టు చేశారని, ఆల్బమ్ చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదంలో తన సోదరుడు మరణించాడన్నారు. ఆ తర్వాత డ్యాన్స్ చేయడం ఆపివేసి 18 సంవత్సరాలు అయ్యిందని తెలిపాడు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here