Gifts to Employees: ఉద్యోగులకు కార్లు, బైక్‌లు.. అదిరిపోయే బహుమతులు ఇచ్చిన చెన్నై సంస్థ..
ABN , Publish Date - Dec 22 , 2024 | 08:00 PM
ఏడాదంతా కష్టపడి పని చేసి సంస్థకు లాభాలు అందించే ఉద్యోగుల శ్రమను కొన్ని సంస్థలు గుర్తిస్తాయి. ఏదో ఒక సందర్భాన్ని ఎంచుకుని ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, బహుమతులు అందజేస్తాయి. ఆ మాత్రం గుర్తింపునకే ఉద్యోగులు ఎంతో సంబరపడిపోతారు.
ఏడాదంతా కష్టపడి పని చేసి సంస్థకు లాభాలు అందించే ఉద్యోగుల (Employees) శ్రమను కొన్ని సంస్థలు గుర్తిస్తాయి. ఏదో ఒక సందర్భాన్ని ఎంచుకుని ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, బహుమతులు అందజేస్తాయి. ఆ మాత్రం గుర్తింపునకే ఉద్యోగులు ఎంతో సంబరపడిపోతారు. అలాంటిది భారీ బహుమతులు (Gifts) ఇస్తే వారి ఆనందం ఎన్ని రెట్లు పెరుగుతుంది. తాజాగా చెన్నైకి చెందిన ఓ సంస్థ (Chennai Firm) తన ఉద్యోగులకు అదిరిపోయే బహుమతులను అందించింది (Viral News).
చెన్నైకు చెందిన సర్‌మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ బహుమతులు అందించి ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాలలో ముంచింది. దాదాపు 20 మంది ఉద్యోగులకు పైగా ప్రోత్సాహకంగా ఖరీదైన బహుమతులను అందించింది. టాటా కార్లను, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు, యాక్టివా స్కూటీలను అందించింది. దాంతో ఉద్యోగులు ఎంతో సంతోషపడ్డారు. సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ డెంజిల్ రాయన్‌కు ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సంస్థ ఎండీ డెంజిల్ రాయన్ మాట్లాడుతూ.. ``షిప్పింగ్‌లో లాజిస్టిక్స్ సవాళ్ళను సమర్ధవంతంగా పరిష్కారం అందించే దిశగా మా సంస్థ పని చేస్తుంది. ఇలాంటి బహుమతులు ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగుల సంతృప్తి మెరుగుపరుస్తాయి. వారు ఆనందంగా ఉంటే ఉత్పాదకత మెరుగుపడుతుంది. ప్రేరణ పొందిన ఉద్యోగులు మరింత బాగా పని చేస్తార``ని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Oreo Biscuits: వామ్మో.. ఓరియో బిస్కెట్స్ అంత ప్రమాదకరామా? బిస్కెట్లలో కేన్సర్ కారక రసాయనాలు..?
Viral Video: ఆ యువతి వెంటనే స్పందించకపోతే.. ఊహించడమే కష్టం.. షాకింగ్ వీడియో వైరల్!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి