Oreo Biscuits: వామ్మో.. ఓరియో బిస్కెట్స్ అంత ప్రమాదకరమా? బిస్కెట్లలో కేన్సర్ కారక రసాయనాలు..?
ABN , Publish Date - Dec 22 , 2024 | 05:24 PM
మనదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా ఓరియో బిస్కెట్లకు ఫ్యాన్స్ ఉన్నారు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ బిస్కెట్లు సురక్షితమైనవేనా? వీటిల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆందోళన చెందడం ఖాయం
ఓరియో బిస్కెట్లను (Oreo cookies) పిల్లలు మాత్రమే కాదు.. పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా ఓరియో బిస్కెట్లకు ఫ్యాన్స్ ఉన్నారు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ బిస్కెట్లు సురక్షితమైనవేనా? వీటిల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆందోళన చెందడం ఖాయం (cancer-causing chemicals). ఓరియో బిస్కెట్లు ప్రమాదకరమైనవని నిరూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. @MarioNawfal అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
దాదాపు 30 సెకన్ల పాటు మంటతో కాల్చిన తర్వాత కూడా ఓరియోస్ కాలిపోవడం లేదా నాశనం కావడం లేదని చూపించే వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓరియో కుక్కీస్‌ను బ్లో టార్చ్‌తో కాలుస్తున్నారు. 30 సెకెన్ల పాటు కాల్చిన తర్వాత కూడా ఓరియో బిస్కెట్లు కాలిపోవడం లేదా నాశనమవడం జరగడం లేదు. దాంతో ఆ బిస్కెట్ల తయారీలో గాఢమైన రసాయనాలను వాడుతున్నారని చాలా మంది అనుమానిస్తున్నారు. ఓరియో కుకీలు క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలను కలిగి ఉన్నాయని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. 19 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అంటే ఓరియో కుక్కీలతో నిర్మితమైన ఇల్లు అగ్నిని తట్టుకోగలదన్న మాట``, ``అగ్నిమాపక సిబ్బంది ఒరియోస్ ఎందుకు ధరించరు``, ``బ్లో టార్చ్ కూడా మండించలేని క్యాన్సర్ కారక జ్వాల రిటార్డెంట్ రసాయనాలతో కూడిన ఓరియో కుకీలు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆ యువతి వెంటనే స్పందించకపోతే.. ఊహించడమే కష్టం.. షాకింగ్ వీడియో వైరల్!
Anand Mahindra: వందేళ్లకు పైగా చెరగని చరిత్ర.. పులకించిపోయిన ఆనంద్ మహీంద్రా..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి