Viral Video: ఆకాశంలో అద్భుతం.. స్వర్గానికి నిచ్చెన వేసేశాడు..
ABN , Publish Date - May 15 , 2024 | 05:31 PM
Viral News: ‘అనుకుంటే కానిది ఏమున్నది.. మనిషనుకుంటే కానిది ఏమున్నది.. చేయరా సాహసం నీ జయం నిశ్చయం’ అంటూ సాగే ఈ పాట.. నిజంగానే మనుషి తలుచుకుంటే చేయలేని పని అంటూ ఉండదని చాటిచెప్తుంది. నిజ జీవితంలో చాలా మంది పెద్ద పెద్ద కలలు కంటుంటారు. ఆ కలలను(Dreams) ఎదుటి వారికి చెబితే.. చాల్లే బడాయి.. ఆకాశానికి నిచ్చెన('Stairway To Heaven) వేయకు అంటూ..
Viral News: ‘అనుకుంటే కానిది ఏమున్నది.. మనిషనుకుంటే కానిది ఏమున్నది.. చేయరా సాహసం నీ జయం నిశ్చయం’ అంటూ సాగే ఈ పాట.. నిజంగానే మనుషి తలుచుకుంటే చేయలేని పని అంటూ ఉండదని చాటిచెప్తుంది. నిజ జీవితంలో చాలా మంది పెద్ద పెద్ద కలలు కంటుంటారు. ఆ కలలను(Dreams) ఎదుటి వారికి చెబితే.. చాల్లే బడాయి.. ఆకాశానికి నిచ్చెన('Stairway To Heaven) వేయకు అంటూ హేళన చేస్తుంటారు. కానీ, వాస్తవానికి ఎంతటి పెద్ద లక్ష్యమైనా.. దానిని నెరవేర్చుకునేందుకు వారు పెట్టే శ్రద్ధ, శ్రమించే విధానం, అంకిత భావం వారి లక్ష్య చేధనను నిర్ణయిస్తుంది. తాజాగా ఓ ఆర్టిస్ట్ ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఎవరూ ఊహించని రీతిలో ఆకాశానికి కాదు.. ఏకంగా స్వర్గానికే నిచ్చెన వేశాడు.
ఆకాశానికి, స్వర్గానికి నిచ్చెన ఏంటా? అని ఆలోచిస్తున్నారా? అవునండీ బాబూ.. ఓ ఆర్టిస్ట్.. తన అమ్మమ్మ కోసం ఏకంగా స్వర్గానికే నిచ్చెన వేసే ప్రయత్నం చేశాడు. అలాంటి ఇలాంటి నిచ్చెన కాదండోయ్.. నిప్పులు కక్కుతూ.. ఆకాశం వైపు ఎగబాకుతూ వెళ్లే నిచ్చెనను రూపొందించాడు సదరు ఆర్టిస్ట్. ఈ నిచ్చెన కథ ఏంటి? అసలు అతను ఎందుకు దీనిని రూపొందించాడు. వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..
కాయ్ గువో కియాంగ్.. చైనాలో ఇతనికి మంచి ఫైర్ క్రాకర్స్ ఆర్టిస్ట్‌గా పేరుంది. ఇతనే.. ఆకాశంలో అద్భుతం సృష్టించాడు. తన అమ్మమ్మ కోసం.. నిప్పులు కక్కుకుంటూ ఆకాశానికి ఎగబాకే నిచ్చెనను తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బాణాసంచా తయారీలో స్పెషలిస్ట్ అయిన కియాంగ్.. ఆకాశంలో 502 మీటర్ల ఎత్తు వరకు టపాసుల నిచ్చెనను రూపొందించాడు. రాగి తీగలో లోడ్ చేసిన గన్‌పౌడర్‌తో ఈ స్కై ల్యాడర్‌ను రూపొందించాడు. దీనిని ఒకసారి కాల్చగా.. నిప్పులు చిమ్ముతూ ఆకాశం వైపు సుమారు 1,650 అడుగుల ఎత్తు వరకు ఎగబాకుతూ నిచ్చెన ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పుడది వైరల్‌గా మారింది. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
మరో ట్విస్ట్..
వాస్తవానికి, ఈ ప్రయోగం పదేళ్ల క్రితం చేశాడు కియాంగ్. కానీ, ఇప్పుడు ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. 2015లో కియాంగ్ తన అమ్మమ్మ 100వ పుట్టినరోజును పురస్కరించుకుని ‘స్వర్గానికి మెట్లు’ సృష్టించాడు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. కియాంగ్‌కు ఇది మూడవ ప్రయోగం. మొదటిసారి 1994లో ఈ ప్రయోగం చేయగా.. బలమైన గాలులు వీయడంతో తన ప్రయోగం విఫలం అయ్యింది. ఆ తర్వాత 2001లో ప్రయోగానికి సిద్ధమవగా.. అమెరికాలో జరిగిన 9/11 ఉగ్ర దాడుల నేపథ్యంలో షాంఘైలోని అధికారులు అతనికి అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత పదేళ్ల కిందట అంటే 2015లో మూడోసారి కియాంగ్ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. అంతేకాదు.. కియాంగ్ 2008లో బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం కోసం ప్రత్యేకంగా బాణసంచా రూపొందించాడు. ఈ సమయంలో అతను సృష్టించిన క్రాకర్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్నాయి.