Share News

China: కోరి వచ్చిన కోట్ల ఆస్తిని కాదనుకున్నాడు.. 26 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను కలుసుకుని..

ABN , Publish Date - Dec 15 , 2024 | 08:09 PM

కోటీశ్వరుల కుమారుడైనా పేదవాడిలా జీవించాడు. చివరకు తన 26వ ఏట తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకున్నాడు. అయితే అందివచ్చిన కోట్ల ఆస్తిని మాత్రం స్వీకరించలేదు. ఎప్పటిలా సింపుల్‌గా జీవించడానికే ఇష్టపడుతున్నాడు.

China: కోరి వచ్చిన కోట్ల ఆస్తిని కాదనుకున్నాడు.. 26 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను కలుసుకుని..
Chinese man rejects wealth to stay humble

ఆ కుర్రాడు చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. 25 ఏళ్ల పాటు అనాథలా పెరిగాడు.. కోటీశ్వరుల కుమారుడైనా పేదవాడిలా జీవించాడు. చివరకు తన 26వ ఏట తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకున్నాడు. అయితే అందివచ్చిన కోట్ల ఆస్తిని మాత్రం స్వీకరించలేదు. ఎప్పటిలా సింపుల్‌గా జీవించడానికే ఇష్టపడుతున్నాడు. ఆ వ్యక్తికి సంబంధించిన కథ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రికలో ప్రచురితమైంది. అతడి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (China Viral News).


చైనాకు చెందిన 26 ఏళ్ల షి కిన్షువాయ్ కథ చాలా మందిని ఆకట్టుకుంటోంది. మిలియనీర్ దంపతుల కుమారుడైన కిన్షువాయ్ 25 ఏళ్ల క్రితం కిడ్నాప్‌నకు గురయ్యాడు. అప్పటికి అతడి వయసు కేవలం 3 నెలలు మాత్రమే. అప్పటి నుంచి కిన్షువాయ్ కోసం అతడి తల్లిదండ్రులు అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. కిన్షువాయ్‌ను పట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కొడుకు కోసం అలా 25 ఏళ్ల పాటు వెతికిన తర్వాత ఇటీవల అతడి జాడను కనుగొన్నారు. దీంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 25 ఏళ్లు అనాథలా బతికిన కొడుకును ఇంటికి తీసుకెళ్లి భారీగా సంబరాలు చేసుకున్నారు.


కొడుకును డబ్బులు ముంచెత్తాలనుకున్నారు. అతడి కోసం విలాసవంతమైన భవనం, ఖరీదైన కారు సహా ఎన్నో సిద్ధం చేశారు. అయితే కిన్షువాయ్ మాత్రం వాటిని అంగీకరించలేదు. తనకు విలాసవంతమైన జీవితం అక్కర్లేదని, తను, తన భార్య జీవించడానికి ఓ సాధారణ ఫ్లాట్ ఇస్తే చాలని తల్లిదండ్రులను కోరాడు. దీంతో వారు ఆశ్చర్యపోయారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ వారు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చదివిన నెటిజన్లు కిన్షువాయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: బాబోయ్.. హిప్పోకు ఇంత కోపం వస్తుందా?.. టూరిస్ట్‌లకు ఎలా వణికించిందో చూస్తే..


Viral Video: ఈ ఏనుగు సైజ్ మాత్రమే కాదు.. మనసు కూడా చాలా పెద్దది.. వీడియో చూస్తే దీనిని ప్రేమించకుండా ఉండలేరు..


Viral Video: వామ్మో.. ట్రాక్టర్‌ను తోయబోయి ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నాడో చూడండి.. వీడియో వైరల్..


Viral Video: చైనాలో అంతే.. భారీ బిల్డింగ్‌ల మీద నుంచి కార్లు ఎలా వెళ్లిపోతున్నాయో చూడండి..


Viral Video: సరదా తీరిపోయింది.. గుర్రం బళ్లతో రేస్.. చివరకు ఆ కుర్రాళ్ల పరిస్థితి ఏమైందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 15 , 2024 | 08:09 PM