Shocking: డ్రైవర్ చేసిన చిన్న తప్పు.. భారీ మూల్యం చెల్లించిన ఓనర్.. ఒడిశాలో ఏం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Nov 11 , 2024 | 09:21 AM
తాజాగా ఒడిశాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఏకంగా బస్ చోరీకి గురైంది. దొంగలు బస్సును చోరీ చేస్తున్న ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. షాకైన యజమాని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
సాధారణంగా చాలా మంది దొంగలు బైక్‌లు, స్కూటీలు దొంగతనాలు (Theft) చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కొద్ది మంది కార్లను కూడా చోరీ చేస్తుంటారు. అయితే బస్సు (Bus) దొంగతనం గురించి మీరెప్పుడైనా విన్నారా? తాజాగా ఒడిశా (Odisha)లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఏకంగా బస్ చోరీకి (Bus Theft) గురైంది. దొంగలు బస్సును చోరీ చేస్తున్న ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. షాకైన యజమాని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (Crime News).
ఒడిశాలోని గంజాం జిల్లా భంజానగర్ ప్రాంతంలో ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. మా దుర్గ అనే ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సును రాత్రి వేళ దొంగలు తీసుకెళ్లిపోయారు. డ్రైవర్ బస్సు తాళాలను లోపలే వదిలేసి స్టాండ్‌లో పార్క్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ విషయం పసిగట్టిన దొంగలు దర్జాగా బస్సు ఎక్కి దాన్ని తీసుకెళ్లిపోయారు. బస్సు కనబడకపోవడంతో యజమాని షాకయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ చూడగా అసలు విషయం బయటపడింది. కన్నీటి పర్యంతమైన యజమాని వెంటనే భంజానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
యజమాని ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుదీర్ఘ విచారణ తర్వాత బెర్హంపూర్ జిల్లాలోని ఛత్రపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై చోరీకి గురైన బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగలను మాత్రం ఇంకా గుర్తించలేదు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. తక్కువ ఖర్చుతో రూమ్ హీటర్ ఎలా తయారు చేశాడంటే..
IQ Test: ఈ నలుగురిలో ప్రమాదంలో ఉన్నది ఎవరు?.. 5 సెకెన్లలో గుర్తించి హెచ్చరించండి..
Viral Video: పాపా.. అవి నీళ్లు కావు.. పెట్రోల్.. బంక్ దగ్గర ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.