Share News

Viral Video: నిరుద్యోగులకు మామూలు పంచ్ వేయలేదుగా.. ఈ దోస మాస్టర్ మాటలు వింటే షాకవ్వాల్సిందే..!

ABN , Publish Date - Jan 12 , 2024 | 08:55 AM

దేశంలో చాలామంది చదువు అయిపోగానే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమవుతూ చివరికి ఎటూ కాకుండా మిగిలిపోతారు. ప్రైవేటు కంపెనీలలో చిన్న చిన్న వేతనాలకు కుదురుకుంటారు. ఇలాంటి వాళ్లందరికీ తన ఒక్క మాటతో చెంప చెళ్లుమనిపించాడు ఈ దోస మాస్టర్.

Viral Video:  నిరుద్యోగులకు మామూలు పంచ్ వేయలేదుగా.. ఈ దోస మాస్టర్ మాటలు వింటే షాకవ్వాల్సిందే..!

భారతదేశంలో సగానికి పైగా యువత ఉన్నారు. భారతదేశ భవిష్యత్తు అంతా యువత భుజాలమీదనే ఉంటుంది. కానీ దేశంలో చాలామంది చదువు అయిపోగానే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమవుతూ చివరికి ఎటూ కాకుండా మిగిలిపోతారు. ప్రైవేటు కంపెనీలలో చిన్న చిన్న వేతనాలకు కుదురుకుంటారు. ఇలాంటి వాళ్లందరికీ తన ఒక్క మాటతో చెంప చెళ్లుమనిపించాడు ఓ దోస మాస్టర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నిరుద్యోగులే కాదు.. కార్పోరేట్ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉలిక్కిపడుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం కూడా ఒక కళ. ఇది అందరికీ ఉండదు. చాలామంది బాగా చదువుకుంటే డబ్బు సంపాదించవచ్చని అనుకుంటారు. అది నిజమే అయినా అందరికీ ఉద్యోగాలు దొరకడం కష్టమే. ఇక చదువులేని వారి గురించి చాలామంది సానుభూతి చూపిస్తారు. కానీ చదువుకు డబ్బు సంపాదనకు సంబంధం లేదని ఓ దోస మాస్టర్(Dosa master) స్పష్టం చేశాడు. వీడియోలో ఓ వ్యక్తి షెప్ రూపంలో దోశలు వేస్తూ కనిపిస్తాడు. అతనికి నెలవారీ సంపాదన గురించి ప్రశ్న ఎదురైంది. ఆ సమయంలో అతను దోసెల మీద వెన్న వేస్తూ ఇది చూడండి ఇది అమూల్ వెన్న.. అంటూ దోసకు ఉపయోగిస్తున్న వెన్న క్వాలిటీ గురించి చెప్తాడు. కానీ ఆ తరువాత 'ఇది కాదు సార్ డబ్బు ఎక్కువ సంపాదించడానికి కారణం, నేను చదువుకున్నది తక్కువ అందుకే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాను. నేను కూడా బాగా చదువుకుని ఉంటే ఏ కార్పోరేట్ సంస్థలోనో 30-40వేలకు ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడినేమో..' అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ఉద్యోగస్థులు, నిరుద్యోగస్థులకు తూటాల్లా తగులుతున్నాయి.

ఇది కూడా చదవండి: 30ఏళ్ల తర్వాత బలంగా ఉండాలంటే.. తినాల్సిన ఆహారాల లిస్ట్ ఇదీ..!


ఈ వీడియోను Ashman Kumar Larokar అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'అతని మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. చదువుకున్నవారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని చాలా సూక్ష్మంగా చెప్పాడు' అని ఒకరు కామెంట్ చేశారు. 'అతను చెప్పింది నిజమే ఉద్యోగం చేస్తే సంపాదనలో మెరుగుదల ఆశించినంత ఉండదు. వ్యాపారం చేయడం చాలా మంచిది' అని మరొకరు అన్నారు. 'నేను మోమోస్ షాప్ పెడతాను' అని ఇంకొకరు కామెంట్స్ లోనే తన ప్లాన్ గురించి చెప్పుకొచ్చాడు. కాగా ఈ మధ్య పానీపూరీ అమ్ముతున్న ఓ చిరు వ్యాపారి కూడా నెలకు సులభంగా 75వేలు సంపాదిస్తున్నానని చెప్పిన వీడియో కూడా బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: Anand Mahindra: అయ్యబాబోయ్.. ఈ కుర్రాడి కడుపులో ట్రాక్టర్ ఏమైనా ఉందా? ఇతని ట్యాలెంట్ కు ఆనంద్ మహీంద్రా ఫిదా..!


Updated Date - Jan 12 , 2024 | 08:55 AM