Viral Video: భారత్‌లో సరే.. చైనాలో జనరల్ రైలు బోగీలో ప్రయాణం ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా
ABN , Publish Date - Sep 22 , 2024 | 04:38 PM
భారత్‌లో జనరల్ బోగీలో ప్రయాణమంటనే నిత్య నరకం. మరి పొరుగునున్న చైనాలో సాధారణ బోగీ రైలు ప్రయాణం ఎలా ఉంటుంది. ఈ బోగీలో ప్రయాణం చైనా వాసులకు నరకమేనా? లేకుంటే ఆ ప్రయాణం వారికి కులాసాగా ఉంటుందా? ఈ వీడియో చూస్తే మీకే ఓ క్లారిటీ మాత్రం రావడం పక్కా గ్యారంటీ..
భారతీయ రైల్వే అంటేనే మినీ భారతదేశం. దేశంలో జనభా పెరిగినట్లుగా రైళ్లలో సాధారణ బోగీలను భారతీయ రైల్వే పెంచడం లేదు. దీంతో సాధారణ బోగీలో రైలు ప్రయాణం అంటేనే ప్రయాణికుడికి ఓ నరకం. సోదాహరణగా చెప్పాలంటే మాత్రం.. సదరు రైలు బోగీలు భారీ లగేజీలతో పాటు ప్రయాణికులతో కిక్కిరిసి పోయి ఉంటాయి. అడుగు పెట్టేందుకు అంగుళం ఖాళీ కూడా ఉండదు. చివరికి ఈ బోగీల్లోని బాత్ రూమ్‌ల వద్ద ప్రయాణికులు కూర్చుని ఉంటారు.
అలాగే బోగీ గేట్ల వద్ద సైతం ప్రయాణికులు కూర్చుంటారు. ఈ రైలు బోగీల్లోని బాత్‌రూమ్‌ల గురించి చెప్పాలంటే మాత్రం మాటలు చాలవు. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గందం వస్తున్నా.. ప్రయాణికులు అక్కడే కూర్చుని తమ ప్రయాణం సాగిస్తుంటారు. పండగలు, వరుస సెలవు దినాలు వస్తే మాత్రం.. మూడు నెలల ముందే రైల్వే రిజర్వేషనులు పూర్తవుతాయి.
దీంతో బస్సుల్లో ఊరికి వెళ్తామంటే బస్ టికెట్ల ధరలు ఆకాశానంటుతాయి. దీంతో పలువురు ప్రయాణికులు.. మధ్యే మార్గంగా ఈ సాధారణ రైలు బోగీలను ఆశ్రయిస్తారు. ఆ సమయంలో సాధారణ రైలు బోగీలో ప్రయాణం అంటే ఒక విధంగా నరకానికి నకలు. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు నడుస్తున్న రైళ్లలోని సాధారణ బోగీల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంటుంది.
అయితే భారత్ పొరుగు దేశం చైనా. ఆ దేశంలో సాధారణ రైలు బోగీలు ఎలా ఉంటాయి. ఆ దేశంలో కూడా భారత్‌లో లాగానే ప్రయాణికులు కిక్కిరిసి పోయి ఉంటారా?. చైనా రైళ్లలో సాధారణ బోగీల్లో బాత్ రూమ్‌లు సైతం భారత్‌లోని సాధారణ రైల్లోని బాత్‌రూమ్‌లాగే దుర్గంధం వెదజల్లుతుందా? అనే ప్రశ్నలు ఇప్పటికే పలువురిలో తలెత్తి ఉంటుంది. ఎందుకంటే ఇరుగు పొరుగు దేశాలైన భారత్, చైనాలు.. ప్రపంచంలోని అతి పెద్ద జనాభా కలిగిన దేశాలుగా ఉన్నాయి.
ఇంకా స్పష్టంగా చెప్పాంటే మాత్రం ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగిన దేశంగా చైనా ఉంటే.. ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది. అలాంటి వేళ చైనాలోని సాధారణ రైలు బోగీ ప్రయాణం ఎలా ఉంటుంది. బాత్ రూమ్‌లు ఎలా ఉంటాయనే వివరాలను భారతీయ యూట్యూబర్ నోమడ్ శుభం తన వీడియో ద్వారా క్లియర్ కట్‌గా వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే వ్యూస్ లక్షల్లో చేరుకుంది. ఇక ఆలస్యమెందుకు మీరు ఈ వీడియోను ఒక్కసారి వీక్షిస్తే.. చైనాలో సాధారణ బోగీలో రైలు ప్రయాణం ఎలా ఉంటుందో స్పష్టమవుతుంది.
మరిన్ని ప్రత్యేకమైన వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..