Share News

Viral Video: ఎలా వస్తాయి సామీ ఇలాంటి ఐడియాలు.. ఇతను బైక్‌ను ఎలా మార్చేశాడో మీరే చూడండి..!

ABN , Publish Date - Feb 08 , 2024 | 04:31 PM

ఇంటర్నెట్ వినియోగం అందరికీ అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో సగటు పౌరుడి ప్రతిభ చాలా తొందరగా వైరల్ అవుతుంది ఇతని ట్యాలెంట్ కూడా ఇంతే..

Viral Video: ఎలా వస్తాయి సామీ ఇలాంటి ఐడియాలు.. ఇతను బైక్‌ను ఎలా మార్చేశాడో మీరే చూడండి..!

సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పించేవి అయితే మరికొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇంటర్నెట్ వినియోగం అందరికీ అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో సగటు పౌరుడి ప్రతిభ చాలా తొందరగా వైరల్ అవుతుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి ట్యాలెంట్ ను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఒక వ్యక్తి తన బైక్ ను స్మార్ట్ గా మార్చేశాడు. ఇది ఎలక్ట్రిక్ బైక్ కాకపోయినా దీంట్లో ఉన్న సౌకర్యాలు చూస్తే అవాక్కవ్వాల్సిందే. వీడియోలో ఒక వ్యక్తి తన బైక్ గురించి చెప్పడం కనిపిస్తుంది. బైక్ ముందు భాగంలో ఎలక్ట్రిక్ బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో బల్బ్ హోల్డర్ , సాకెట్, స్విచ్ ఉన్నాయి. బైక్ కు హెడ్ లైట్లు లేకపోవడంతో ఓ సగటు పౌరుడు హెడ్ లైట్స్ కు బదులు ఇలా స్విచ్ బోర్డ్ సెట్ చేసుకున్నాడు. కేవలం బల్బ్ మాత్రమే కాకుండా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం కూడా ఇందులో ఏర్పాటు చేయబడింది. ఈ స్విచ్ బోర్డ్ ను బైక్ ఇంజన్ కు వైర్ల సహాయంతో అనుసంధానం చేశాడు.

ఇది కూడా చదవండి: వాస్తు ప్రకారం పడకగదిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.


ఈ వీడియోను the_shubhvlog అనే ఇన్స్ట్రాగ్రామ్(Instagram) అకౌంట్ నుండటి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'ఎలాన్ మస్క్ నుండి 50మిస్డ్ కాల్స్ వచ్చి ఉండాలి ఇతనికి' అని ఒకరు కామెంట్ చేశారు. 'కోచింగ్, కాలేజీ లాంటివి ఏమీ లేకుండా ఇతను ఇంజనీర్ అయిపోయాడు' అని మరొకరు కామెంట్ చేశారు. 'వర్షం పడినప్పుడు దీని పరిస్థితేంటి? బల్బ్ వెలుగుతుందా లేదా ఫ్యూజ్ ఎగిరిపోతుందా?' అని మరొకరు కామెంట్ చేశారు.

ఇది కూడా చదవండి: WeightLoss: ఎంత బరువున్నా సరే.. ఖాళీ కడుపుతో ఈ ఫుడ్స్ తింటే చాలు.. ఈజీగా బరువు తగ్గిపోవచ్చట!


మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 08 , 2024 | 04:55 PM