Viral Video: వావ్.. ఈ రైలు ప్రయాణం చాలా ప్రత్యేకం.. రైల్వే మంత్రి షేర్ చేసిన వీడియో చూసేయండి!
ABN , Publish Date - Feb 16 , 2024 | 02:54 PM
ఎక్కడో యూరప్ లోనే కనిపించే అందాలు మన భారత్ లోనూ ఇలా దర్శనమిస్తున్నాయ్..
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన రై్ల్వే సౌకర్యాల గురించి, రైల్వే స్టేషన్లు, ఇతర ఆకర్షణీయమైన ఫోటోలను సోషల్ మీడియోలో పంచుకుంటారు. ఆయన తాజాగా షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైలు ప్రయాణిస్తున్న ఈ వీడియోలో ప్రత్యకత నెటిజన్లను మంత్రముగ్జులను చేస్తోంది. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
భారత్ లో అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేస్ అని చెప్పడంలో సందేహం లేదు. రైలు ప్రయాణాల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. భారత్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Central Railway minister Aswini Vaishnaw) సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అయిన సంభార్ సరస్సు గుండా రైలు ప్రయాణిస్తోంది. ఈ వీడియోను ట్రావెల్ ఫోటోగ్రాఫర్ రాజ్ మోహన్ డ్రోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరానికి సమీపంలో ఉన్న సంభార్ సరస్సు దేశంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. సమోద్, మంథా, రూపన్‌గర్, ఖరీ, ఖండేలా అనే ఐదు నదుల నీరు ఇందులో చేరుతుంది. సంభార్ సరస్సు ప్రతి సంవత్సరం 196000 టన్నుల స్వచ్ఛమైన ఉప్పును ఉత్పత్తి చేస్తుంది. ఈ రైలు ప్రయాణం వీడియో చాలా అద్భుతంగా ఉండటంతో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఇది కూడా చదవండి: ఎప్పుడూ టెన్షన్ గా అనిపిస్తూ ఉంటుందా? ఈ 9 అలవాట్లు వదిలేయండి చాలు..!
ఈ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. "భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు ఉప్పు నీటి సరస్సు పై అందమైన రైలు ప్రయాణం" అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ మెన్షస్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ముగ్దులు అవుతున్నారు. పలువిధాలుగా కామెంట్ చేస్తున్నారు. "ఇంతకుముందు ఇలాంటి అందాలు యూరప్ లాంటి దేశాలలో చూసేవాళ్లం కానీ ఇప్పుడు నాదేశంలోనే చూస్తున్నాం" అని ఒకరు కామెంట్ చేశారు. "బ్యూటిఫుల్ అండ్ కూల్" అని ఇంకొకరు స్పందించారు.
ఇది కూడా చదవండి: Viral Video: పిల్లలతో అడవికి వెళ్లి ఇవేం పనులయ్యా బాబూ.. ఈ టూరిస్ట్ లు ఏం చేశారో మీరే చూడండి!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.