Watch Video: పాప మిస్ అయ్యిందని కంగారుపడిన తండ్రి.. కట్ చేస్తే షాకింగ్ సీన్..
ABN , Publish Date - Jan 19 , 2024 | 07:27 PM
Viral News: సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా.. ఇలాంటి ఇంట్రస్టింగ్ వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. సాధారణంగా తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలు కనిపించకపోతే కంగారుపడిపోతారు.
Viral News: సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా.. ఇలాంటి ఇంట్రస్టింగ్ వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. సాధారణంగా తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలు కనిపించకపోతే కంగారుపడిపోతారు. అప్పటి వరకు చేతిలోనే ఉండి.. కాసేపట్లోనే కనిపించకపోతే.. ఆ కంగారు మరింత పెరిగిపోతోంది. తాజాగా ఓ తండ్రి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు.
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లాడు మొదలు.. ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఫోన్ వినియోగిస్తున్నారు. ఫోన్ లేకుంటే జీవితమే లేదన్నంతగా ఉంటున్నారు జనాలు. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఫోన్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఫోన్ కారణంగా మనుషులు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ వ్యక్తి ఫోన్ ఒక చేత్తో మాట్లాడుకుంటూ.. మరో చేత్తో బేబీ స్ట్రోలర్ నడుపుతూ వస్తున్నాడు. అతని కూతురు అతని భుజాలపై కూర్చుని ఉంది. అయితే, కొంత దూరం ఇలాగే నడుచుకుంటూ వచ్చిన ఆ వ్యక్తికి.. బేబీ స్ట్రోలర్‌లో తన పాప కనిపించలేదు. దీంతో కంగారుపడిపోయిన ఆ వ్యక్తి వెనక్కి వెళ్లి తన కూతురు కోసం వెతికాడు. పాప తన భుజాల మీదనే ఉందనే విషయాన్ని మర్చిపోయి.. కాసేపు కంగారుపడిపోయాడు. కొంతసేపటికి పాప తన భుజాలపైనే ఉందని గ్రహించి హమ్మయ్య అనుకున్నాడు. పాపను బేబీ స్ట్రోలర్‌లో కూర్చోబెట్టి జాగ్రత్తగా తీసుకెళ్లాడు.
ఈ సీన్ అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లా్ట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వీడియో చూసి రకరాలుగా స్పందిస్తున్నారు. ఫోన్ ప్రజలను ఇలా మార్చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.