Viral: 8 కేజీల శనగపిండితో బూందీ చేసిన జర్మన్ మహిళ! వీడియో వైరల్
ABN , Publish Date - Nov 12 , 2024 | 05:48 PM
శనగపిండితో బూందీ చేస్తున్న ఓ జర్మనీ మహిళ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారతీయులకు ఈ వీడియో అమితంగా నచ్చడంతో ఇది ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: విదేశీయుల్లో చాలా మందికి భారతీయ వంటకాలంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఇండియాకు ఎప్పుడు వచ్చినా వాళ్లు ఇక్కడి వంటకాల్ని తప్పకుండా ఆరగిస్తారు. అంతేకాదు, విదేశాల్లో ఉండే భారతీయ రెస్టారెంట్లలోనూ భారతీయ వంటకాల్ని ఎంజాయ్ చేస్తారు. కొందరేమో వీటిని స్వయంగా వండి, ఆయా వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుని భారతీయ ఫుడ్స్‌పై తమ మక్కువను బాహాటంగా తెలియజేస్తుంటారు. ఇలాంటి వీడియోలకు భారతీయులు కూడా బ్రహ్మరథం పడతారు కాబట్టి తరచూ ఇవి వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (viral).
Viral: పెళ్లిలో వధూవరులకు భారీ షాక్! మా తప్పేంటో చెప్పండంటూ ఆవేదన
జర్మనీకి చెందిన జెన్నీ అనే మహిళ ఏకంగా 8 కేజీల శనగపిండితో లడ్డూలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పంచుకుంది. లడ్డూల కోసం తను బూందీ వేయిస్తున్న వీడియోను ఆమె ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. భారతీయులు ఆరుబయట వండుకున్నట్టుగానే ఆమె కూడా బయట స్టవ్‌లు ఏర్పాటు చేసి బూందీ వేయించింది. తనతో పాటు చుట్టూ ఉన్న వారు కూడా బూందీ చేశారు. ఆమె జాగ్రత్తగా శనగపిండిని నూనెలోకి బొట్లుబొట్లుగా జారవిడిచి మంచి రంగు వచ్చేలా వేయించింది. ఆ తరువాత వాటిని గరిటెతో బయటకు తీసింది.
బ్యాక్‌గ్రౌండ్‌లో లతామంగేష్కర్ పాట వినపడుతుండగా వారంతా ఉత్సాహంగా బూందీ చేయడంలో నిమగ్నమైపోయారు. వందల మంది కోసమని 8 కేజీల పిండితో లడ్డూలు చేస్తున్నట్టు ఆమె తన వీడియో క్యాప్షన్‌లో తెలిపింది. ఇంట్లో కంటే ఆరుబయట వంట చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, ఓ కొత్త అనుభూతి కలుగుతుందని కూడా చెప్పుకొచ్చింది. ఇలా చేస్తుంటే తనకు ఇండియాలో ఉన్న భావన కలిగిందని కూడా తెలిపింది.
Viral: ప్రసవ సమయంలో డాక్టర్ల పొరపాటు.. 18 ఏళ్లుగా మహిళకు నరకం
ఈ వీడియోపై సహజంగానే పెద్ద సంఖ్యలో ప్రశంసలు వెల్లువెత్తాయి. అనేక మంది భారతీయులు తమకు లడ్డూలు ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆమె లతా మంగేష్కర్ పాటను ఎంచుకోవడంపై కూడా ప్రశంసలు కురిపించారు. జెన్నీకి మంచి అభిరుచి ఉందంటూ కామెంట్ చేశారు.
కాగా, విదేశీయులు భారతీయ వంటకాలు వండుతున్న వీడియోలు గతంలోనూ వైరల్ అయ్యాయి. న్యూజిలాండ్‌కు చెందిన షెష్ ఆండీ హెరెండ్సన్ ఇటీవల తనదైన ప్రత్యేక రెసిపీతో మసాలా దోస చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. మసాలా దోస రుచికి ఎవరైనా ఫిదా కావాల్సిందేనని అనేక మంది కామెంట్ చేశారు.