Share News

Viral Video: ఇదీ ఫ్యామిలీ వర్క్ కు దక్కే ఫలితం.. ఏనుగు పిల్ల బురదలో పడిపోతే ఏనుగులన్నీ ఏం చేశాయో మీరే చూడండి..!

ABN , Publish Date - Jan 29 , 2024 | 02:12 PM

ఓ ఏనుగు పిల్ల బురదలో పడిపోతే ఆ ఏనుగు కుటుంబం అంతా కలసి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: ఇదీ ఫ్యామిలీ వర్క్ కు దక్కే ఫలితం.. ఏనుగు పిల్ల బురదలో పడిపోతే ఏనుగులన్నీ ఏం చేశాయో మీరే చూడండి..!

ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి మొట్టమొదటగా అండగా నిలిచేది కుటుంబమే. సమస్యలలోనూ, ఇబ్బందులలోనూ, కష్టాల మధ్యనా కుటుంబ సభ్యులే గుర్తుకువస్తారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోవారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటారు. ఇది కేలవం మనుషులలోనే కాదు కొన్ని జంతువులలో కూడా కనిపిస్తుంది. అడవిలో ఉండే క్రూర జంతువులు కూడా కుటుంబం విషయంలో చాలా బాధ్యతగా ఉంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఓ ఏనుగు పిల్ల బురదలో పడిపోతే ఆ ఏనుగు కుటుంబం అంతా కలసి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

దక్షిణాఫ్రికాలోని అడ్డో ఎలిఫెంట్ నేషనల్ పార్క్(Addo Elephant National Park in South Africa) లో ఓ అపురూపమయిన దృశ్యం చోటుచేసుకుంది. ఎలిఫెంట్ నేషనల్ పార్క్ లో సంచరిస్తున్న ఏనుగులు దాహం తీర్చుకోవానికి ఓ నీటి గుంట దగ్గరకు చేరుకున్నాయి. పెద్ద ఏనుగులు అన్నీ ఒకదాని తరువాత ఒకటి దాహం తీర్చుకోగా చిన్న ఏనుగుల వంతు వచ్చింది. ఓ చిన్న గున్న ఏనుగు దాహం తీర్చుకోవడానికి ఆ నీటి గుంటకు చాలా దగ్గరగా వెళ్లింది. దురదృష్టవశాత్తు అది నిలబడిన ప్రాంతం జారే స్వాభావం కలిగినది కావడంతో అది ఒక్కసారిగా జారి నీళ్లలో పడి గల్లంతైంది. దీంతో అక్కడున్న ఏనుగులలో గందరగోళం నెలకొంది. ఏనుగులన్నీ పిల్ల ఏనుగును బయటకు తీయడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాయి. తొండాలు నీటిలోకి చాచి పిల్ల ఏనుగుకు అందించాయి. పిల్ల ఏనుగు చాలా చిన్నది కావడంతో పెద్ద ఏనుగుల తొండాలను బలంగా పట్టుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. చివరికి వెనుకల విశ్రాంతి తీసుకుంటున్న ఏనుగులు కూడా ముందుకు వచ్చి ఏనుగు పిల్లను బయటకు తీయడంలో తమ వంతు సహాయం చేశాయి. చివరికి ఏనుగు పిల్లను బయటకు తీశాయి. అవన్నీ కలసి ఏనుగు పిల్లకు జెడ్ ప్లస్ సెక్యురిటీ మధ్యన అక్కడినుండి తీసుకెళ్లాయి. (Elephant Family Save baby Elephant into mud pond)

ఇది కూడా చదవండి: Healthy Rotis: రాగి, గోధుమ, జొన్న.. మూడింటిలో ఏది బెస్ట్? ఆరోగ్యానికి ఏ రొట్టెలు మంచివంటే..!



ఈ వీడియోను Cute Tings అనే యూట్యూబ్ ఛానెల్(You Tube Channel) లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఏనుగులను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ వర్క్ కు దక్కే ఫలితం. మాకెందుకులే అని మిగిలిన ఏనుగులు పక్కకెళ్లిపోతే ఆ పిల్ల ఏనుగు పరిస్థితి ఏమైపోయి ఉండేదో అని మరికొందరు స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బాబోయ్.. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలు ఇవా..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 02:12 PM