Share News

Viral Video: భలే వాడివి బాసు: చేతులు లేవు... కానీ బండి నడిపి.. ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు

ABN , Publish Date - Oct 27 , 2024 | 05:31 PM

చేతులు లేవు. వాహనం నడుపుతున్నాడు. ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. అది కూడా జొమాటో సంస్థ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌గా అతడు విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు.. అతడిపై ప్రశంసల జల్లు కురిస్తున్నారు.

Viral Video: భలే వాడివి బాసు: చేతులు లేవు... కానీ బండి నడిపి.. ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు

అన్ని అవయవాలు సక్రమంగా ఉంటాయి. ఏ పని చేయరు. సోమరులుగా ఉంటారు. కోపిస్టులుగా వ్యవహరిస్తుంటారు. జులాయిలుగా తిరుగుతుంటారు. ఈ తరహా వైఖరి ఉన్న మనుషులను మనం నిత్యం ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు చూస్తుంటాం. అలాగే అంగవైకల్యం ఉండి కూడా.. తమ పనులు తాము చేసుకునే వాళ్లు సైతం మనకు దర్శనమిస్తుంటారు. అలాంటి వాళ్లు తమకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ పలువురు మన్నన్నలు అందుకుంటారు.

Also Read: AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?


అలాంటి వ్యక్తికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాని చుట్టేస్తుంది. రెండు చేతులు లేవు. అయినా జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఫుడ్ డెలివరీ చేయాలంటే కచ్చితంగా వాహనం ఉండి తీరాలి. చేతులు లేకపోయినా వాహనాన్ని నడుపుతూ.. తనకు అప్పగించిన ఫుడ్ ప్యాకెట్లను సకాలంలో డెలివరీ చేస్తున్నాడీ వ్యక్తి. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: రోజు బీరు తాగుతున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..


బండి ఎలా నడుపుతున్నావు అంకుల్ అని ప్రశ్నించారు. అతడు ఏం సమాధానం మివ్వకుండా.. నవ్వుతూ చేతులు ఊపాడు. దీంతో మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది అంకుల్ అని చెప్పారు. దీంతో జొమాటో ఫుడ్ డెలివరి ఏజెంట్.. తన వాహనాన్ని స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తుంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


రక్షణ కోసం హెల్మెట్ ధరించాలంటూ అతడికి సూచించారు. వీళ్లు నిజ జీవితంలో హీరోలని పేర్కొన్నారు. వీళ్లను గౌరవించాలని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు పరిస్థితులతోపాటు జీవితాలను నిందించే వారు.. వీరిని చూసి స్ఫూర్తి పొందాలని అభిప్రాయపడ్డారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించే శక్తిని అతడికి ఆ దేవుడు ప్రసాదించాలంటూ మరో నెట్‌జన్ ప్రార్థించారు.


అతడి పట్టుదల, అంకితభావానికి సెల్యూట్ అని మరో నెటిజన్ స్పష్టం చేశారు. అలాగే అతడి ముఖంలో భయం కానీ, ఆందోళన కానీ ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. అతడిలో నిండైన ఆత్మవిశ్వాసం తొణకిసలాడుతుందని ఇంకో నెటిజన్ స్పష్టం చేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..

Updated Date - Oct 27 , 2024 | 06:01 PM