Viral: సూపర్ మార్కెట్లో బాలిక రచ్చ.. షాకింగ్ వీడియో వైరల్
ABN , Publish Date - Dec 03 , 2024 | 01:54 PM
అమెరికాలో ఓ బాలిక సూపర్ మార్కెట్లో రచ్చ రచ్చ చేసిన ఉదంతం తాలూకు వీడియో ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది. బాలిక చేసిన పనికి సూపర్ మార్కెట్‌లోని వారందరూ ఏం జరుగుతోందో అర్థం కాక నోరెళ్లబెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఓ బాలిక సూపర్ మార్కెట్లో రచ్చ రచ్చ చేసిన ఉదంతం తాలూకు వీడియో ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది. బాలిక చేసిన పనికి సూపర్ మార్కెట్‌లోని వారందరూ ఏం జరుగుతోందో అర్థం కాక నోరెళ్లబెట్టారు. వాల్‌మార్ట్ షాపులో ఈ సంఘటన వెలుగు చూసింది (Viral).
Viral: వెయ్యి ఇళ్ల తాళాలు పగలగొట్టి చొరబడ్డాడు.. ఎందుకని అడిగితే..
పూర్తి వివరాల్లోకి వెళితే, వాల్‌మార్ట్ స్టోర్‌కు వచ్చిన ఓ బాలిక నానా బీభత్సం సృష్టించింది. అక్కడున్న అలమారాలను కాలితో తన్నింది. ర్యాకుల్లో ఉన్న రకరకాల వస్తువులను చిందరవందరగా విసిరేసింది. పూనకం వచ్చినట్టు ఊగిపోయింది. పట్టరాని కోపం, దుఃఖంలో ఉన్నట్టు సామాన్లను చిందరవందరగా విసిరేసింది. పాల కార్టన్లు, కోడి గుడ్లు అన్ని నేల పాలు చేసింది. బాలిక ఎందుకలా చేస్తోందో అర్థంకాక ఇతర కస్టమర్లు అందరూ నోరెళ్లబెట్టారు. బాలిక జోలికెళ్లే సాహసం కూడా చేయలేదు.
ఈ క్రమంలో ఇద్దరు వాల్‌మార్ట్ ఉద్యోగులు చిన్నారిని సమీపించి ఆమెను ఆపే ప్రయత్నం చేయబోయారు. ఈలోపే మరో కస్టమర్ వారిని వారించారు. మరొకరి పిల్లల్ని తాకొద్దంటూ గట్టిగా హెచ్చరించడంతో వారు వెనక్కు తగ్గారు. ఇంత జరుగుతున్నా బాలిక మాత్రం తన రభస ఆపకపోవడంతో అసహనానికి లోనైన ఓ ఉద్యోగి వెంటనే పోలీసులు ఫోన్ చేద్దామని సూచించారు. అదే సమయంలో ఓ మహిళ బాలిక పరిస్థితి అర్థమైనట్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆమెపై అరవొద్దు. వీడియో కూడా తీయొద్దు. ఆమెను ఆపొద్దు. ఆమె మానాన ఆమెను వదిలేయండి. ఆమెకు ఏం కష్టం వచ్చిందో మనకు తెలీదు. చిన్నారిని ఇబ్బంది పెటొద్దు’’ అని సూచించింది.
Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా! తీవ్ర విమర్శ చేసిన నెటిజన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్
ఈ క్రమంలోనే ఓ మహిళ చిన్నారి వీపు చుట్టు అనునాయంగా చేయి వేసేందుకు ప్రయత్నించినా బాలిక మాత్రం వెనక్కుతగ్గలేదు. ఒంటరిగా ఉన్న చిన్నారిని చూసిన అనేక మంది ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో అని ప్రశ్నించారు. ఈలోపు ఓ వ్యక్తి చిన్నారిని వచ్చి భుజానకెత్తుకుని తీసుకెళ్లాడు. అక్కడితో వీడియో ముగియడంతో ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం తెలియకుండా పోయింది. ఈ ఉదంతం నెట్టింట కూడా కలకలం రేపుతోంది. బాలిక అంతలా అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణం ఏమై ఉంటుందో అని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట వైరల్ అవుతోంది.