Viral Video: వామ్మో.. గర్ల్‌ఫ్రెండ్ దెబ్బకు భూమిలోకి వెళ్లిపోయాడు.. వీడియో చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 20 , 2024 | 09:05 PM
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను తక్కువ అంచనా వేసి, తన మీద తను విపరీతమైన నమ్మకం పెట్టుకుని సమస్యల్లో చిక్కుకున్నాడు. దెబ్బకు మాయం అయిపోయాడు.
ఒక్కోసారి అతి నమ్మకం కూడా తీరని ఇబ్బందులు కలిగిస్తుంది. మన మీద మనకు అతి నమ్మకం ఇక్కట్ల పాలు చేస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Funny Video) చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ (Girlfriend)ను తక్కువ అంచనా వేసి, తన మీద తను విపరీతమైన నమ్మకం పెట్టుకుని సమస్యల్లో చిక్కుకున్నాడు. దెబ్బకు మాయం అయిపోయాడు. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు (Viral Video).
@terakyalenadena అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి బోటులో నది మీద షికారుకు వెళ్లాడు. ముందుగా అతడు నదిలోకి దిగిపోయాడు. ఆ తర్వాత తన గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా దూకమన్నాడు. ఆమె దూకితే అతడు తన రెండు చేతులతో ఆమెను పట్టుకుని వీడియో తీయించుకోవాలనుకున్నాడు. అతడితో పోల్చుకుంటే ఆమె అధిక బరువుతో ఉంది. ఆమె అతడి మీదకు దూకగానే అతడు నీటి లోపలికి వెళ్లిపోయాడు. ఆమె మొత్తం వెతికినా వీడియో చివరి వరకు అతడు బయటకు రాలేదు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు దాదాపు 53 వేల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``పాటను సీరియస్‌గా తీసుకున్నాడు పాపం``, ``అతడికి తన మీద తనకు నమ్మకం ఎక్కువ``, ``గర్ల్‌ఫ్రెండ్‌ను తక్కువగా అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది``, ``అతడు భూమిలోకి కూరుకుపోయినట్టున్నాడు`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: పాపం.. బైక్ ఎక్కిన స్నేహితుడికి షాక్.. రోడ్డు మీద ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు..
Viral News: ఉబర్‌లో క్యాబ్ బుక్ చేస్తే.. వచ్చినదాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు.. వీడియో వైరల్..
Viral Video: రీల్స్ కోసం ఇలా చేయడం తప్పు.. ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల విమర్శలు ఎందుకంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి