Share News

Viral Video: వావ్.. సూపర్ బ్రదర్.. వంటింట్లోకి దూరిన నాగుపామును పట్టుకోవడానికి అతడు వాడిన టెక్నిక్ చూడండి..!

ABN , Publish Date - Aug 27 , 2024 | 06:26 PM

ఇళ్లలోకి చొరబడుతున్న పాములను అద్భుతమైన టెక్నిక్‌తో పట్టుకునే వీడియోలు ప్రస్తుతం నెట్టింట ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని వ్యక్తి ఇంటలోకి చొరబడిన నాగుపామును పట్టుకుని దానిని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశాడు.

Viral Video: వావ్.. సూపర్ బ్రదర్.. వంటింట్లోకి దూరిన నాగుపామును పట్టుకోవడానికి అతడు వాడిన టెక్నిక్ చూడండి..!
Man Rescues king Cobra

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాములకు (Snakes) సంబంధించిన రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని మనల్ని ఆశ్చర్యపరిచేవిగా ఉంటే, మరికొన్ని భయపెడుతున్నాయి. ఇళ్లలోకి చొరబడుతున్న పాములను అద్భుతమైన టెక్నిక్‌తో పట్టుకునే వీడియోలే (Snake Videos) నెట్టింట ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని వ్యక్తి ఇంటలోకి చొరబడిన నాగుపామును (King Cobra) పట్టుకుని దానిని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశాడు (Viral Video).


suraj_snakes_friend అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియలో ఒక నాగుపాము కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై నుంచి పాకుతోంది. స్నేక్ క్యాచర్ దానిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అత్యంత విషపూరితమైన నాగుపాము తోకను పట్టుకుని బయటకు లాగాడు (Snake Catching Video). అనంతరం దానిని ఓ పైప్‌లోకి పంపించాడు. ఆ పైప్‌నకు మరో చివరన క్లాత్ సంచిని ఉంచాడు. పైప్‌లోకి ప్రవేశించిన నాగుపాము దాని గుండా ఆ సంచిలోకి వెళ్లింది. వెంటనే ఆ సంచిని తాడుతో కట్టేసి తీసుకెళ్లిపోయారు. అడవిలోకి వెళ్లాక ఆ పామును సురక్షితంగా వదిలేశారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``అతడి ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్``, ``వీళ్లు లేకపోతే అటు పాములకు, ఇటు మనుషులకు ప్రమాదమే``, ``నాకు పాములంటే భయమే. కానీ, ఈ వీడియో మనోహరంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: బ్యాక్ బెంచ్ స్టూడెంట్.. ఆ కుర్రాడి ట్యాలెంట్‌కు టీచర్ ఫిదా.. చివరకు ఏం చేసిందో చూడండి..!

Picture Puzzle: మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో గోల్ఫ్ బాల్‌ను 8 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: అన్నా అంత తొందరెందుకు.. రాంగ్ రూట్‌లో వచ్చిన బైకర్‌కు ఆర్మీ మ్యాన్ ఇచ్చిన కోటింగ్ మామూలుగా లేదు!


Viral Video: నాగుపాము పడగ విప్పితే.. పెద్ద పులి అయినా తోకముడవాల్సిందే.. వీడియో వైరల్!



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2024 | 06:26 PM