Share News

Viral Video: వామ్మో.. జలపాతం విశ్వరూపం చూస్తే భయపడాల్సిందే.. బ్రిడ్జ్ మీద ఆ జనాల నమ్మకం చూస్తే..

ABN , Publish Date - Dec 24 , 2024 | 09:05 PM

ప్రకృతి సౌందర్య ప్రేమికులు ఎక్కువగా జలపాతాలను ఇష్టపడతారు. అయితే కొన్ని జలపాతాలు మాత్రం అప్పుడప్పుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తాయి. ఆ సమయంలో ఎంత ప్రకృతి ప్రేమికులైనా భయంతో వణికిపోవాల్సిందే. తాజాగా బ్రెజిల్‌లోని ఇగ్వాజు జలపాతం చూసేవారిని భయకంపితులను చేస్తుంది.

Viral Video: వామ్మో.. జలపాతం విశ్వరూపం చూస్తే భయపడాల్సిందే.. బ్రిడ్జ్ మీద ఆ జనాల నమ్మకం చూస్తే..
iguacu waterfalls in Brazil

ప్రతి దేశంలోనూ ప్రకృతి రమణీయ దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. ప్రకృతి ఎంత అందమైనదో అంతే భయంకరమైనది. ముఖ్యంగా జలపాతాలు ఎంతో మందిని ఆకట్టుకుంటాయి. ప్రకృతి సౌందర్య ప్రేమికులు ఎక్కువగా జలపాతాలను (Waterfalls) ఇష్టపడతారు. అయితే కొన్ని జలపాతాలు మాత్రం అప్పుడప్పుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తాయి. ఆ సమయంలో ఎంత ప్రకృతి ప్రేమికులైనా భయంతో వణికిపోవాల్సిందే. తాజాగా బ్రెజిల్‌ (Brazil)లోని ఇగ్వాజు జలపాతం (Iguazu waterfalls) చూసేవారిని భయకంపితులను చేస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది (Viral Video).


richardvailati అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. బ్రెజిల్‌లోని ఇగ్వాజు జలపాతాన్ని ఇటీవల పర్యాటకుల కోసం తెరిచారు. ఇగ్వాజు జలపాతం ప్రపంచంలోని అత్యంత భయానక జలపాతాలలో ఒకటి. ఆ జలపాతంలో నీరు అత్యంత వేగంగా, అత్యంత భారీగా ప్రవహిస్తుంటుంది. అలాంటి జలపాతం మధ్యలో ఓ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఆ బ్రిడ్జ్ మీద నిల్చుని జలపాతాన్ని చూడడం ఎంతటి వారికైనా భయం కలిగిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఎవరికైనా హాలీవుడ్ సినిమాలోని సీన్ అనిపించడం ఖాయం.


వీడియో చూస్తుంటేనే చాలా మందికి భయం వేస్తోంది. అయితే అంత వేగంగా ప్రవహిస్తున్న జలపాతం మధ్య బ్రిడ్జ్ మీద నిల్చుని చాలా మంది ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ ఇగ్వాజు జలపాతం అర్జెంటీనా సరిహద్దులో బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రంలో ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాలలో ఒకటి. 2.7 కిలోమీటర్ల పొడవైన ఈ జలపాతంలో వందల కొద్దీ జలపాతాలు కలుస్తాయి. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. ఏడు లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఇది మామూలు ప్రాంక్ కాదు.. స్నేహితుడిని నమ్మినందుకు ఎలా మోసం చేశాడో చూడండి..


Viral Video: పల్లీలు అమ్ముకునే ఈ బాలిక ముందు గ్రాడ్యుయేట్లు కూడా దిగదుడుపే.. పాక్ బాలిక ఇంగ్లీష్ వినండి..


Viral Video: ఓహో.. అందుకే చలి ఇంతలా పెరుగుతోందా? అంకుల్ చేసిన పనిపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..


Optical Illusion Test: ఈ పళ్లలో నిమ్మకాయను 7 సెకెన్లలో పట్టుకుంటే.. మీ కళ్లకు సలాం కొట్టాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 24 , 2024 | 09:05 PM