Viral Video: ఇది మామూలు ప్రాంక్ కాదు.. స్నేహితుడిని నమ్మినందుకు ఎలా మోసం చేశాడో చూడండి..
ABN , Publish Date - Dec 24 , 2024 | 08:26 PM
సోషల్ మీడియా వీడియోల్లో ఏది, ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు, ప్రాంక్ వీడియోలను ఎక్కువ మంది ఆసక్తికరంగా చూస్తుంటారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే అలాంటి ఎన్నో వేల ప్రాంక్ వీడియోలు వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో ఏది, ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు, ప్రాంక్ వీడియోలను (Prank Videos) ఎక్కువ మంది ఆసక్తికరంగా చూస్తుంటారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే అలాంటి ఎన్నో వేల ప్రాంక్ వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అలాంటిదే మరో ప్రాంక్ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చూసిన వారు నవ్వుకుంటున్నారు (Viral Video).
@VishalMalvi అనే ట్విటర్ ఖాతాలో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇంటి బయట నిలిచిన నీటిపై ఒక చాప (Mat) తేలుతోంది. ఓ వ్యక్తి ఆ చాపపై కూర్చున్నాడు. అయినా అతడు మునిగిపోడు. అది చూసి అతడి స్నేహితుడు ఆశ్చర్యపోతాడు. ఆ స్నేహితుడి చాపను కూడా తీసుకుని మంత్రం వేసినట్ట నటించి తిరిగి ఇచ్చాడు. దాంతో ఆ స్నేహితుడు కూడా నీటిపై చాపను ఉంచాడు. అయితే కాలు పెట్టగానే అతను నీటిలో పడిపోయాడు. అతను పడిపోయిన తర్వాత, ముందు కూర్చున్న వ్యక్తి అసలు విషయం బయటపెట్టాడు. ఆ వ్యక్తి నీటిలో ఓ టేబుల్ ఉంచి దానిపై చాప ఉంచాడు. అందువల్లనే అతడు మునిగిపోలేదు.
ఆ విషయం తెలియని స్నేహితుడు నీటిలో పడిపోయాడు. ``2024లో అతి పెద్ద ప్రాంక్ వీడియో`` అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ప్రాంక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను కొద్ది సేపట్లోనే 3.3 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.2 వేల కంటే ఎక్కువ మంది లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఓహో.. అందుకే చలి ఇంతలా పెరుగుతోందా? అంకుల్ చేసిన పనిపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..
Optical Illusion Test: ఈ పళ్లలో నిమ్మకాయను 7 సెకెన్లలో పట్టుకుంటే.. మీ కళ్లకు సలాం కొట్టాల్సిందే..
Viral Video: ఎదుటి వారికి హాని చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి