Share News

Viral Video: బిచ్చగాడితో రూ.50 పందెం.. కారులోని వ్యక్తికి ఆ వికలాంగుడు ఇచ్చిన షాక్ చూస్తే..

ABN , Publish Date - Dec 25 , 2024 | 09:50 PM

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉండి, మరికొన్ని ఫన్నీగా ఉండి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కారులో కూర్చున్న వ్యక్తికి వికలాంగుడైన ఓ బిచ్చగాడు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఆ వీడియో చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు.

Viral Video: బిచ్చగాడితో రూ.50 పందెం.. కారులోని వ్యక్తికి ఆ వికలాంగుడు ఇచ్చిన షాక్ చూస్తే..
Funny viral Video

సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ఆసక్తికరంగా ఉండి, మరికొన్ని ఫన్నీగా ఉండి వైరల్ అవుతున్నాయి (Funny Videos). ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కారులో కూర్చున్న వ్యక్తికి వికలాంగుడైన ఓ బిచ్చగాడు (Beggar) దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఆ వీడియో చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు (Viral Video).


@introvert_hu_ji అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కారు రోడ్డు పక్కన ఆగి ఉంది. ఆ కారు వద్దకు ఓ వికలాంగుడు వచ్చి డబ్బులు అడిగాడు. అందుకు కారులోని వ్యక్తి స్పందిస్తూ.. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే రూ.50 ఇస్తానని కర్రల సహాయంతో నడుస్తున్న ఆ బిచ్చగాడికి చెప్పాడు. దీంతో ఆ బిచ్చగాడు కర్రల సహాయంతో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి, తిరిగి కర్రల సహాయం లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అంటే అతడు నిజంగా వికలాంగుడు కాదు.. బిచ్చమెత్తుకోవడం కోసం వికలాంగుడిగా నటిస్తున్నాడన్నమాట.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దాదాపు 1.7 లక్షల మంది ఆ వీడియోన వీక్షించారు. మూడు వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``రూ.50 కోసం తన కెరీర్‌నే పణంగా పెట్టాడు``, ``ఇలా ఎంతో మంది మోసం చేస్తుంటారు``, ``దిమ్మదిరిగే షాక్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పాపం.. కారును ఎడారిలోకి తీసుకెళ్లాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..


Santa Claus: శాంటా క్లాజ్ ఎక్కడ ఉంటాడు? అతడికి ఉత్తరాలు రాయాలంటే అడ్రస్ ఏంటి?


Viral Video: ఇది ఆల్టో కాదు.. మినీ థార్.. ఓ వ్యక్తి ఇంజినీరింగ్ ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


Picture Puzzle Test: ఈ ఫొటోలో తప్పేంటో 5 సెకెన్లలో కనిపెడితే.. మీ అబ్జర్వేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Viral Video: ఇది మామూలు ప్రాంక్ కాదు.. స్నేహితుడిని నమ్మినందుకు ఎలా మోసం చేశాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 25 , 2024 | 09:50 PM