Viral Video: పాపం.. కారును ఎడారిలోకి తీసుకెళ్లాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
ABN , Publish Date - Dec 25 , 2024 | 09:17 PM
ఎడారిలో ఒంటెలపై ప్రయాణించాలి. లేదా ఇసుక ప్రాంతాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలను ఉపయోగించాలి. ఓ వ్యక్తి ఆ విషయాన్ని పట్టించుకోకుండా కారులో ఎడారి ప్రాంతంలో పర్యటించాడు. అందుకు తగిన మూల్యం చెల్లించాడు.
ఒక్కో వాహనాన్ని ఒక్కో రహదారిపై నడపాలి. రోడ్డు మీద నడిచే వాహనాలతో ఎడారి, నీటి ప్రాంతాల్లో ప్రయాణించడం కుదరదు. ఎడారి (Desert)లో ఒంటెలపై ప్రయాణించాలి. లేదా ఇసుక ప్రాంతాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలను ఉపయోగించాలి. ఓ వ్యక్తి ఆ విషయాన్ని పట్టించుకోకుండా కారు (Car)లో ఎడారి ప్రాంతంలో పర్యటించాడు. అందుకు తగిన మూల్యం చెల్లించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు తమ స్పందనలను తెలియజేస్తున్నారు (Viral Video).
@VinoBhojak అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను థార్ ఎడారిలో చిత్రీకరించారు. ఆ వీడియోలో ఓ కారు ఎడారిలోని ఇసుకలో కూరుకుపోయింది. దానిని బయటకు తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనబడలేదు. చివరకు ట్రాక్టర్‌తో లాగడానికి ప్రయత్నించినా ఆ కారు మాత్రం బయటకు రాలేదు. సగం మాత్రమే బయటకు వచ్చింది. ఆ కారు పరిస్థితిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ``రాజస్థాన్‌కు రండి.. కానీ ఇతరులను ఫాలో అవకండి`` అని కామెంట్ చేశారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోను 1.5 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇసుకలో చిక్కుకుపోతే అలాగే ఉంటుంది``, ``కారుతో ఇసుకలో ప్రయాణించడం మూర్ఖత్వం``, ``ట్రాక్టర్ కూడా లాగలేకపోయిందంటే పరిస్థితి ఏంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Santa Claus: శాంటా క్లాజ్ ఎక్కడ ఉంటాడు? అతడికి ఉత్తరాలు రాయాలంటే అడ్రస్ ఏంటి?
Viral Video: ఇది ఆల్టో కాదు.. మినీ థార్.. ఓ వ్యక్తి ఇంజినీరింగ్ ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Viral Video: ఇది మామూలు ప్రాంక్ కాదు.. స్నేహితుడిని నమ్మినందుకు ఎలా మోసం చేశాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి