Share News

Viral Video: వావ్.. ఈ మేకలు చాలా మంది కంటే బెస్ట్ లైఫ్ గడుపుతున్నాయి.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Nov 30 , 2024 | 07:53 PM

సాధారణంగా మేకలు ఆకులు తింటుంటాయి. అయితే ఓ వ్యక్తి తన మేకలకు ఆకులకు బదులుగా జీడిపప్పు పెడుతున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ మేకల యజమాని అంబానీ కంటే ధనవంతుడు అని కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వావ్.. ఈ మేకలు చాలా మంది కంటే బెస్ట్ లైఫ్ గడుపుతున్నాయి.. కారణం ఏంటంటే..
A man was seen feeding cashews to goats

సాధారణంగా గ్రామాల్లో చాలా మంది మేకలను (Goats) పెంచుతుంటారు. వాటికి ప్రతిరోజూ బాగా మేత అందించి మటన్ షాప్‌లకు అమ్మేస్తుంటారు. సాధారణంగా మేకలు ఆకులు తింటుంటాయి. అయితే ఓ వ్యక్తి తన మేకలకు ఆకులకు బదులుగా జీడిపప్పు (Cashew) పెడుతున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ మేకల యజమాని అంబానీ కంటే ధనవంతుడు అని ఒకరు, ది ఈ మేకలు కోట్లాది మంది కంటే మెరుగైన జీవితాన్ని గడుపుతున్నాయని మరొకరు కామెంట్లు చేశారు. ఏదేమైనా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@VishalMalvi అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి జీడిపప్పులు ఉన్న బస్తాను తెరిచి ఓ బకెట్ నిండా జీడిపప్పును నింపాడు. తర్వాత ఆ బకెట్ తీసుకొని మేకలకు మేత వేయడం కోసం వెళ్తాడు. మేకలు ఆ వ్యక్తిని అనుసరించాయి. జీడిప్పప్పును మేకలు తినే పాత్రల్లో వేశాడు. ఆ తర్వాత ఆ మేకలు వాటిని తినడం ప్రారంభించాయి. దాదాపు 100కు పైగా మేకలు జీడిపప్పు తినేందుకు పోటీ పడడం ఆ వీడియోలో చూడవచ్చు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 19 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 8.4 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఈ మేకలు మనకంటే మంచి జీవితాన్ని గడుపుతున్నాయి``, ``మేకలు జీడిపప్పు కూడా తింటాయా``, ``అతడు అంబానీ కంటే ధనవంతుడిలా ఉన్నాడు``, ``మేకలకు జీడిపప్పు పెట్టడం ఇప్పుడే చూస్తున్నా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇతని మీద ఇతనికి ఎంత నమ్మకమంటే.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..


Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరింది.. ఫుట్‌బాల్‌కు నిప్పు అంటించి గేమ్.. ఏం జరిగిందో చూస్తే కళ్లు తిరగడం ఖాయం..


Viral video: వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.. వరుడిని పరుగులు పెట్టించిన కుర్రాడు.. అసలేం జరిగిందంటే..


Viral Video: అదృష్టమే కాపాడింది.. డివైడర్‌ను ఢీకొని గాల్లోకి ఎగిరిన బైక్.. ఆ వ్యక్తి ఎలా బయటపడ్డాడంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2024 | 07:53 PM