Viral Video: వామ్మో.. ఇతని మీద ఇతనికి ఎంత నమ్మకమంటే.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:59 PM
కొందరు సాహసాలతో సహవాసం చేస్తుంటారు. ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటారు. అలాంటి వారికి తమ మీద తమకు ఎంతో నమ్మకం అవసరం. అంత నమ్మకం ఉంటే తప్ప అలాంటి భయంకర సాహసాలు చేయలేరు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సాధారణ వ్యక్తులకు భిన్నంగా కొందరు భయంకర విన్యాసాలు చేస్తుంటారు. సాహసాలతో (Adventures) సహవాసం చేస్తుంటారు. ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటారు. అలాంటి వారికి తమ మీద తమకు ఎంతో నమ్మకం అవసరం. అంత నమ్మకం ఉంటే తప్ప అలాంటి భయంకర సాహసాలు (Dangerous Stunts) చేయలేరు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే నిజమైన నమ్మకం (Trust) అంటే ఏంటో అర్థమవుతుంది (Viral Video).
@mikechinavlog అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి భయంకర సాహసం చేస్తున్నాడు. తేడా వస్తే తన చేతి వేలు పూర్తిగా తెగిపోతుంది. అలాంటిది ఆ వ్యక్తి తన సామర్థ్యం మీద నమ్మకం ఉంచి భయంకర సాహసానికి దిగాడు. ఒక బెంచి మీద తన చేతి వేలును ఉంచి పెద్ద కత్తితో కచ్చితంగా ఆ వేలు చివరన కొడుతున్నాడు. అలా మూడు సార్లు చేశాడు. ఆ స్టంట్‌లో వెంట్రుక వాసిలో తేడా జరిగినా వేలు తెగిపోవడం మాత్రం ఖాయం. అయినా ఆ వ్యక్తి ఏ మాత్రం భయం లేకుండా ఆ స్టంట్‌ను పూర్తి చేశాడు. తను చేస్తున్న ఫీట్ వల్ల తనకేమీ జరగదన్న విశ్వాసం ఆ వ్యక్తి మొహంలో స్పష్టంగా కనబడుతోంది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మంది వీక్షించారు. 1.8 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నమ్మకానికి పరాకాష్ట ఇది``, ``నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నా``, ``వీడియోను ఎడిట్ చేసి ఉంటారా?``, ``ఇది చాలా ప్రమాదకర సాహసం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral video: వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.. వరుడిని పరుగులు పెట్టించిన కుర్రాడు.. అసలేం జరిగిందంటే..
Optical Illusion Test: మీ కళ్ల వపర్‌కు టెస్ట్.. గులాబీల మధ్యనున్న పీతను 10 సెకెన్లలో గుర్తించండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి