Share News

Viral Video: ఆ ఏనుగు తెలివికి హ్యాట్సాఫ్.. చెట్టు మీద పనస పళ్లను ఎలా తెంపిందో చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Jun 15 , 2024 | 01:13 PM

అత్యంత భారీ శరీరం, బలం కలిగిన ఏనుగు ఈ భూమి మీదే అతి భారీ జంతువు. ఏనుగుకు శరీరం మాత్రమే కాదు.. మెదడు కూడా అద్భుతంగా పని చేస్తుంది. ఇతర జంతువులుతో పోలిస్తే ఏనుగు తెలివైన జంతువు. తనకు కావాల్సినదాన్ని తన తెలివి తేటలతో దక్కించుకుంటుంది.

Viral Video: ఆ ఏనుగు తెలివికి హ్యాట్సాఫ్.. చెట్టు మీద పనస పళ్లను ఎలా తెంపిందో చూడండి.. వీడియో వైరల్!
Elephant

అత్యంత భారీ శరీరం, బలం కలిగిన ఏనుగు (Elephant) ఈ భూమి మీదే అతి భారీ జంతువు. ఏనుగుకు శరీరం మాత్రమే కాదు.. మెదడు కూడా అద్భుతంగా పని చేస్తుంది. ఇతర జంతువులుతో పోలిస్తే ఏనుగు తెలివైన జంతువు. తనకు కావాల్సినదాన్ని తన తెలివి తేటలతో దక్కించుకుంటుంది. ఏనుగులకు సంబంధించిన ఎన్నో వీడియోలు (Elephant Videos) ఇటీవలి కాలంలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది (Viral Video).


wildtrails.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఏనుగు నిర్మానుష్యంగా ఉన్న వీధి గుండా నడుచుకుంటూ వెళ్తోంది. ఆ వీధిలో ఉన్న పనస చెట్టుకు ఉన్న పళ్లను (Jack Fruits) చూసింది. అవి అందనంతో ఎత్తులో ఉన్నాయి. దీంతో ఆ ఏనుగు పక్కనే ఉన్న ఇంటిపై తన ముందరి రెండు కాళ్లు వేసి పైకి లేచి ఆ పనస పళ్లను తొండంతో కొట్టింది. ఏకంగా మూడు పనస పళ్లు కింద పడ్డాయి. ఏనుగులు పనస పళ్లను చాలా ఇష్టంగా తింటాయి.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా తక్కువ సమయంలోనే ఈ వీడియోకు 13 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అడవిలో పనస చెట్ల దగ్గరే ఏనుగులు ఎక్కువగా ఉంటాయి``, ``ఏనుగులు చాలా తెలివైన జంతువులు``, ``ఆ వీడియోగ్రాఫర్‌కు ఓ పనస పండు ఫ్రీ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. వరుసగా రోడ్డుపై పడిపోయిన బైకర్లు.. అసలేం జరిగిందంటే..


Viral Video: ఇలాంటి వాడి బైక్ ఎక్కిన ఆ అమ్మాయి ధైర్యానికి హ్యాట్సాఫ్.. వైరల్ అవుతున్న ప్రమాదకర స్టంట్ వీడియో!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2024 | 01:13 PM