Share News

Viral Video: వావ్ ఆంటీ.. మీ తెలివికి జోహార్లు.. పాడైపోయిన ఫ్రిజ్‌ను ఆమె ఎలా మార్చిందో చూస్తే మెచ్చు కోవాల్సిందే..

ABN , Publish Date - Nov 07 , 2024 | 12:06 PM

పాత వస్తువులను పారెయ్యకుండా వాటిని వేరే విధంగా ఎలా వినియోగించుకోవాలో భారతీయులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. ముఖ్యంగా మధ్య తరగతి గృహిణులు ఆ విషయంలో అమోఘంగా ఆలోచిస్తారు. పాత సామాన్లను, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను వేరే విధంగా చక్కగా ఉపయోగించుకుంటారు

Viral Video: వావ్ ఆంటీ.. మీ తెలివికి జోహార్లు.. పాడైపోయిన ఫ్రిజ్‌ను ఆమె ఎలా మార్చిందో చూస్తే మెచ్చు కోవాల్సిందే..
jugaad trick

పాత వస్తువులను పారెయ్యకుండా వాటిని వేరే విధంగా ఎలా వినియోగించుకోవాలో భారతీయులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. ముఖ్యంగా మధ్య తరగతి గృహిణులు ఆ విషయంలో అమోఘంగా ఆలోచిస్తారు. పాత సామాన్లను, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను వేరే విధంగా చక్కగా ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ పాడైపోయిన ఫ్రిజ్‌ను (Fridge) ఇంట్లోనే ఉంచుకుని అద్భుతంగా ఉపయోగించుకుంటోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


laughwith_mm19 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ పాడైపోయిన పాత ఫ్రిడ్జ్‌ను ఇంటి బయట వరండాలో ఉంచింది. ఆ ఫ్రిడ్జ్ తెరిచి చూడగా అందులో వివిధ వరుసల్లో చెప్పులు ఉన్నాయి. అంటే పాత ఫ్రిడ్జ్‌ను ఆమె చెప్పుల స్టాండ్‌గా (Shoe Stand) వాడుతోందన్న మాట. ఫ్రిడ్జ్ డోర్ కూడా వేయడం వల్ల చెప్పులు భద్రంగా ఉంటాయి. ఆమె తెలివి తేటలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. 8.5 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ``ఆమె నిజంగా లెజెండ్``, ``ఆమె బ్రెయిన్ ఆల్ట్రా ప్రో మ్యాక్స్``, ``ఆమె నుంచి ఎంతో నేర్చుకోవాలి``, ``వేసవిలో చెప్పులు చల్లగా ఉంటాయి`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ రైల్వే గార్డుకు సలాం కొట్టాల్సిందే.. తల్లిదండ్రులను పిల్లలతో ఎలా కలిపాడో చూడండి..


Viral Video: ఈ బైక్ ఎలా నడుస్తోందబ్బా.. పెట్రోల్ లేదు, పెడల్ లేదు.. గాలిలో దూసుకుపోతున్న బైక్..


Viral Video: ఈమె ఒక వర్గానికి ఇన్‌స్పిరేషన్.. వర్షంలో నిల్చుని ఏం చేస్తోందో చూడండి.. నవ్వాపుకోలేరు..


Picture Puzzle: మీ పరిశీలనా శక్తిని టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 07 , 2024 | 12:06 PM