Viral Video: వావ్.. పులులు కూడా ఇలా ప్రవర్తిస్తాయా? ఓ వ్యక్తి యాక్షన్‌కు పులి రియాక్షన్ చూస్తే..
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:43 PM
క్రూర మృగాలు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తాయో ఎవ్వరూ అంచనా వేయలేరు. అయితే ఇటీవలి కాలంలో పులులు, సింహాలు వంటి క్రూర మృగాలను కూడా చాలా మంది పెంపుడు జంతువులను చేసుకుంటున్నారు. ఆ క్రూర మృగాలు కూడా మనుషులకు బాగానే చేరువ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
వన్య ప్రాణుల (Wild Animals) నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవి ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తాయో ఎవ్వరూ అంచనా వేయలేరు. అయితే ఇటీవలి కాలంలో పులులు, సింహాలు వంటి క్రూర మృగాలను కూడా చాలా మంది పెంపుడు జంతువులను చేసుకుంటున్నారు. ముఖ్యంగా దుబాయ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఈ ట్రెండ్ బాగా పెరుగుతోంది. ఆ క్రూర మృగాలు కూడా మనుషులకు బాగానే చేరువ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Viral Video).
@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ చిరుత పులి (Leopard) బోనులో పడుక్కుని ఉంది. ఓ వ్యక్తి బోనులోకి చేయి పెట్టి చిరుత పులి తలను నిమురుతున్నాడు. అతడు అలా నిమురుతుండడాన్ని ఆ పులి బాగా ఎంజాయ్ చేస్తోంది. తన కాలిని అతడి చేతిపై వేసి మరీ ఎక్కడ నిమరాలో చెబుతోంది. ఆ చిరుతను అప్పుడే ఓ ప్రమాదం నుంచి రక్షించి ఆ బోనులో పెట్టి సంరక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదం నుంచి కాపాడిన మనుషులతో ఆ చిరుత ప్రేమగా మెలుగుతోంది. ఆ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 16 లక్షల మంది వీక్షించారు. 46 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``హెడ్ మసాజ్‌ను ఆ పులి బాగా ఎంజాయ్ చేస్తోంది``, ``ఇది చాలా అందమైన వీడియో. జంతువులకు కూడా ప్రేమ అవసరం``, ``వావ్.. సూపర్ మసాజ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral News: హవ్వా.. ఎంత దుర్మార్గం.. చపాతీలు రావడం ఆలస్యమైందని పెళ్లి క్యాన్సిల్.. విషయమేంటంటే..
Optical Illusion Test: మీకు లాలీపాప్ అంటే ఇష్టమా?.. ఈ ఐస్‌క్రీమ్‌ల మధ్య అదెక్కడుందో కనిపెట్టండి..
Shocking: ఇదెక్కడి విచిత్రం.. పక్షి కడపులో నుంచి బయటపడుతున్న చేప.. అసలేం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి