Viral Video: పెళ్లి వేదికపై బావతో మరదలి సరసాలు.. వధువు పరిస్థితి చూస్తే నవ్వు రాక తప్పదు..
ABN , Publish Date - Dec 16 , 2024 | 11:27 AM
ప్రస్తుతం పెళ్లిళ్లలో సంగీత్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వధూవరుల బంధువులు తమ డ్యాన్స్‌తో అతిథులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా జరిగిన ఓ పెళ్లి కార్యక్రమంలో వధువు సోదరి ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది.
ప్రస్తుతం పెళ్లి (Marriage) అంటే హంగామా. డ్యాన్స్‌లు, పాటలు లేకపోతే పెళ్లి మండపం అంతా డల్‌గా మారిపోతుంది. అందుకే చాలా మంది ప్రస్తుతం పెళ్లిళ్లలో సంగీత్ (Sangeeth) కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వధూవరుల బంధువులు తమ డ్యాన్స్‌తో అతిథులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా జరిగిన ఓ పెళ్లి కార్యక్రమంలో వధువు (Bride) సోదరి ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది. ఆ సమయంలో ఆమె వరుడి (Groom)తో ప్రవర్తించిన తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా వధువు ఆ డ్యాన్స్ చూసి బిత్తరపోయి సైలెంట్‌గా ఉండిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
anmol.hameed అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ కార్యక్రమం జరుగుతోంది. వధూవరులు వేదికపై సోఫాలో కూర్చున్నారు. ఆ సమయంలో వధువు సోదరి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. బాలీవుడ్ హిట్ సాంగ్ ``వో జింకే ఆగే జీ, వో జింకే పేచే జీ..`` సాంగ్‌కు ఆమె చిందులు వేసింది. అయితే ఆ సమయంలో ఆమె వరుడితో హద్దు మీరి ప్రవర్తించింది. డ్యాన్స్ వేస్తూ వరుడి ఒళ్లో కూర్చోవడం, వరుడి మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకోవడం వంటి పనులు చేసింది. ఆమె డ్యాన్స్‌కు వరుడు సిగ్గుపడిపోయాడు. పక్కనే కూర్చున్న వధువు కోపంగా చూస్తూ సైలెంట్‌గా ఉండిపోయింది.
ఆమె డ్యాన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది వీక్షించారు. 79.5 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``దేవుడి దయ వల్ల నాకు చెల్లి లేదు``, ``వధువుకు పట్టరాని కోపం వస్తోంది``, ``ఆమె తన చెల్లిని ఎప్పుడూ ఇంటికి రానివ్వదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Shocking: వందల కోట్ల లాటరీ గెలిచాడు.. జీవితం మారిపోతుందనుకున్నాడు.. కొన్ని రోజులకే ఊహించని సీన్..
Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి..
Viral Video: వామ్మో.. ట్రాక్టర్‌ను తోయబోయి ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నాడో చూడండి.. వీడియో వైరల్..
Viral Video: చైనాలో అంతే.. భారీ బిల్డింగ్‌ల మీద నుంచి కార్లు ఎలా వెళ్లిపోతున్నాయో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి