Share News

Viral Video: నీ బ్రెయిన్‌కు సలాం బాసూ.. ఇంటికి ప్లాస్టింగ్ చేసేందుకు ఎలాంటి ట్రిక్ ఉపయోగించాడో చూడండి..

ABN , Publish Date - Dec 01 , 2024 | 07:28 PM

మన దేశంలో చాలా మంది ప్రజలు కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తుంటారు. సాధారణ మేస్త్రిలు కూడా ఇంజినీర్లను మించి పోయేలా అద్భుతమైన పనితనం చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: నీ బ్రెయిన్‌కు సలాం బాసూ.. ఇంటికి ప్లాస్టింగ్ చేసేందుకు ఎలాంటి ట్రిక్ ఉపయోగించాడో చూడండి..
house owner used his amazing brain to get the plastering

మనదేశంలో తెలివైన (Intelligence) వారికి కొదవ లేదు. సామాన్యులు కూడా తమ అద్భుత ఆలోచనలతో ఆశ్చర్యపోయే పనులు చేస్తుంటారు. కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తుంటారు. సాధారణ మేస్త్రిలు కూడా ఇంజినీర్లను మించి పోయేలా అద్భుతమైన పనితనం చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన బహుళ అంతస్థుల భవనానికి ప్లాస్టింగ్ (Plasting) చేసేందుకు విచిత్రమైన ట్రిక్ ఉపయోగించాడు. ఆ ట్రిక్‌కు సంబంధించిన వీడియో (Jugaad Video) నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


naughtyworld అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ భవంతి గోడలకు ప్లాస్టింగ్ చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా క్రేన్‌ను (Crane) ఉపయోగించాడు. ట్రాక్టర్ ట్రక్కును క్రేన్‌కు తగిలించి దానిని పైకి లేపారు. ఆ ట్రక్కులో మేస్త్రీలు నిలబడి గోడలకు ప్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఆ ట్రిక్కును ప్రశంసిస్తుండగా, మరికొందరు అంత ఖర్చు ఎందుకని విమర్శలు చేస్తున్నారు. ఆ వీడియోను బీహార్‌లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది వీక్షించారు. 35 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``అసలు పని కంటే క్రేన్‌ కోసమే ఖర్చు ఎక్కువ అవుతుందేమో``, ``ఇలా ప్లాస్టింగ్ చేయడాన్ని మేమెప్పుడూ చూడలేదు``, ``భారతీయులకు ఇలాంటి ట్యాలెంట్ ఎక్కువ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమెను పెళ్లి చేసుకుంటే అప్పులన్నీ మాయం.. పెళ్లిలో వధువుకు వచ్చిన నగదు బహుమతులు చూస్తే..


Viral Video: ట్రైన్ తలుపు నుంచి వింత శబ్దాలు.. వాటిని ఆపేందుకు ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..


Chennai: తుఫాన్ ఎఫెక్ట్.. చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అయోమయం.. తిరిగి గాల్లోకి లేచిన విమానం..


Viral Video: అచ్చం మనిషిలాగానే పరిగెడుతున్న కోతి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 01 , 2024 | 07:28 PM