Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఆ బాలుడి సరదా ఓ మహిళ ప్రాణాలను ఎలా తీసిందో చూడండి..!

ABN , Publish Date - Aug 03 , 2024 | 09:19 PM

ఓ బాలుడు సరదాగా చేసిన ఓ స్టంట్ ఓ మహిళ ప్రాణాలు తీసేసింది. ఓ బాలికను ప్రాణాపాయ స్థితిలో హాస్పిటిల్‌లో పడేసింది. ఆ భయంకర యాక్సిడెంట్‌కు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘోరం జరిగింది.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఆ బాలుడి సరదా ఓ మహిళ ప్రాణాలను ఎలా తీసిందో చూడండి..!
Kanpur Teen's Car Stunt Goes Wrong

ఓ బాలుడు సరదాగా చేసిన ఓ స్టంట్ (Car Stunt) ఓ మహిళ ప్రాణాలు తీసేసింది. ఓ బాలికను ప్రాణాపాయ స్థితిలో హాస్పిటిల్‌లో పడేసింది. ఆ భయంకర యాక్సిడెంట్‌కు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని కాన్పూర్‌లో ఈ ఘోరం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన కాలనీలో ఉన్న ఇళ్ల సీసీటీవీ కెమేరాలు చెక్ చేయగా యాక్సిడెంట్ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ కారు ఎంత వేగంగా వచ్చిందో చూస్తే షాక్ అవక తప్పదు (Viral Video).


కాన్పూర్‌ (Kanpur)కు చెందిన ఓ 17 ఏళ్ల కుర్రాడు శుక్రవారం నాడు స్కూలుకు డుమ్మా కొట్టాడు. తన స్నేహితులతో కలిసి కారు డ్రైవ్‌ చేశాడు. ఆ సమయంలో బిజీ రోడ్డులో కారుతో స్టంట్‌ చేశాడు. వంద కిలోమీటర్ల వేగంతో కారును నడిపాడు. దాంతో అదుపుతప్పిన కారు అడ్డంగా తిరిగింది. అదే స‌మ‌యంలో అటుగా వ‌స్తున్న‌ స్కూటర్‌పైకి దూసుకెళ్లింది. ఆ కారు ఢీకొట్టడంతో స్కూటర్‌ను డ్రైవ్‌ చేసిన మహిళ, వెనుక కూర్చొన్న ఆమె కుమార్తె గాలిలోకి ఎగిరిపడ్డారు. ఇద్ద‌రికీ తీవ్ర గాయాలు కావ‌డంతో స్థానికులు వెంట‌నే వారిని ఆసుపత్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మ‌హిళ చ‌నిపోయింది. 12 ఏళ్ల కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది (Kanpur Car Accident).


ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమేరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీటి ఆధారంగా కాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన బాలుడిని, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: సర్‌ప్రైజింగ్ వీడియో.. హంస తన పిల్లల కోసం ఎలాంటి ఇల్లు కట్టిందో చూడండి..!


Viral: వామ్మో.. ఐదు నిమిషాల పార్కింగ్.. రూ.11 లక్షల జరిమానా.. ఓ మహిళకు ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..


Viral Video: తమ్ముడూ.. ఇలా అయితే వధువు పారిపోతుందేమో.. పెళ్లిలో వరుడి తుఫాన్ డ్యాన్స్ చూడండి..!


Picture Puzzle: మీవి హెచ్‌డీ కళ్లు అయితే.. ఈ ఫొటోలో తేడాగా ఉన్న డబ్బుల సంచిని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఐదు సింహాలు చుట్టుముడితే ఎలా ఉంటుంది.. ఓ హిప్పో ఏం చేసిందో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 03 , 2024 | 09:19 PM