Share News

Viral Video: వామ్మో.. ట్రాక్టర్‌ను తోయబోయి ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నాడో చూడండి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Dec 15 , 2024 | 04:29 PM

ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో, ఎలా వస్తుందో తెలియదు. రోజూ చేసే పనే అయినా ఒక్కోసారి పట్టు తప్పి ప్రమాదానికి గురి కావచ్చు. అయితే భారీ ప్రమాదం జరిగినా చిన్న పాటి నష్టంతో బయటపడడం అనేది అదృష్టం అనే చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తికి అలాగే జరిగింది.

Viral Video: వామ్మో.. ట్రాక్టర్‌ను తోయబోయి ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నాడో చూడండి.. వీడియో వైరల్..
Tractor accident video

ప్రమాదం (Accident) అంటే ఊహకు అందనిది. ఎప్పుడు, ఏ రూపంలో, ఎలా వస్తుందో తెలియదు. రోజూ చేసే పనే అయినా ఒక్కోసారి పట్టు తప్పి ప్రమాదానికి గురి కావచ్చు. అయితే భారీ ప్రమాదం జరిగినా చిన్న పాటి నష్టంతో బయటపడడం అనేది అదృష్టం అనే చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తికి అలాగే జరిగింది. ట్రాక్టర్ (Tractor) భారీ చక్రం పై నుంచి వెళ్లిపోయినా ఆ వ్యక్తి పెద్దగా గాయపడలేదు. ఆ వీడియో చూసిన వారు భయపడుతున్నారు తప్ప ఆ వ్యక్తి మాత్రం బాగానే ఉన్నాడు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


enamul_hoqe అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆగి ఉన్న ట్రాక్టర్ ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. ట్రాక్టర్ ముందు చక్రాన్ని తోశాడు. ఆ సమయంలో ట్రాక్టర్ స్టార్ట్ అయిపోయి ముందుకు కదలడం ప్రారంభించింది. ఆ వ్యక్తి పైకి ట్రాక్టర్ వెనుక భారీ చక్రం ఎక్కేసింది. అంత భారీ చక్రం ఎక్కడంతో ఆ వ్యక్తి శరీరంలోని ఎముకలు విరిగిపోయి ఉంటాయని అందరూ అనుకుంటారు. అయితే ఆ వ్యక్తి వెంటనే పైకి లేచి ముందుకు వెళ్లిపోతున్న ట్రాక్టర్ ఎక్కి దానిని కంట్రలో చేశాడు. ఈ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 50 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 5.7 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``చాలా బలమైన వ్యక్తి``, ``ఉక్కు శరీరం``, ``అసలు ఎలా జరిగింది``, ``వామ్మో.. భయంకర ఘటన`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: చైనాలో అంతే.. భారీ బిల్డింగ్‌ల మీద నుంచి కార్లు ఎలా వెళ్లిపోతున్నాయో చూడండి..


Viral Video: సరదా తీరిపోయింది.. గుర్రం బళ్లతో రేస్.. చివరకు ఆ కుర్రాళ్ల పరిస్థితి ఏమైందంటే..


Picture puzze Test: మీ బ్రెయిన్ షార్ప్ అనుకుంటున్నారా?.. ఈ బీచ్‌లోని ఆరు డబ్బు సంచులను పట్టుకోండి..


Viral Video: కర్ర పట్టుకొచ్చి పోలీస్ కానిస్టేబుల్ హల్‌చల్.. ట్రక్ డ్రైవర్ మాటలకు భయపడి పరార్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 15 , 2024 | 04:29 PM