Share News

Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే.. 19 ఏళ్ల బాలుడిని గ్రైండర్‌ ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Dec 17 , 2024 | 05:31 PM

జార్ఖండ్‌కు చెందిన సూరజ్ నారాయణ్ యాదవ్ ముంబైలోని వర్లీలో ఉన్న ఓ చైనీస్ ఫుడ్ స్టాల్‌లో పని చేస్తుంటాడు. సచిన్ కొతేకర్ అనే వ్యక్తి ఆ రెస్టారెంట్‌ను నడుపుతుంటాడు. నడుము ఎత్తులో ఉన్న గ్రైండర్‌లో ప్రతిరోజూ మంచూరియా, చైనీస్ బేల్‌పురి కోసం ముడిసరుకును సిద్ధం చేస్తుంటాడు.

Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే.. 19 ఏళ్ల బాలుడిని గ్రైండర్‌ ఏం చేసిందో చూడండి..
boy got crushed in grinder

ఆ కుర్రాడి వయసు 19 సంవత్సరాలు.. ముంబై (Mumbai)లోని రోడ్డు పక్కన ఉండే చైనీస్ ఫుడ్ స్టాల్‌లో పని చేస్తుంటాడు. చైనీస్ ఫుడ్‌కు సంబంధించిన ముడి సరుకును సిద్ధం చేస్తుంటాడు.. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా తన పని చేస్తున్నాడు.. అయితే అనుకోని ప్రమాదం కారణంగా గ్రైండర్‌ (Grinder)లో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).


జార్ఖండ్‌కు చెందిన సూరజ్ నారాయణ్ యాదవ్ ముంబైలోని వర్లీలో ఉన్న ఓ చైనీస్ ఫుడ్ స్టాల్‌లో పని చేస్తుంటాడు. సచిన్ కొతేకర్ అనే వ్యక్తి ఆ రెస్టారెంట్‌ను నడుపుతుంటాడు. నడుము ఎత్తులో ఉన్న గ్రైండర్‌లో ప్రతిరోజూ మంచూరియా, చైనీస్ బేల్‌పురి కోసం ముడిసరుకును సిద్ధం చేస్తుంటాడు. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ముడి సరుకును సిద్ధం చేసేందుకు గ్రైండర్ దగ్గరకు వెళ్లాడు. గ్రైండర్‌లో చేయి పెట్టి పిండిని కలుపుతున్నాడు. ఆ సమయంలో అతడి చొక్కా ఆ గ్రైండర్‌లో ఇరుక్కుంది. దీంతో ఆ యంత్రం ఆ కుర్రాడిని అమాంతంగా లోపలికి లాగేసుకుంది. దీంతో సూరజ్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


ఆ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. సూరజ్ యాదవ్‌కు అటువంటి యంత్రాలను ఆపరేట్ చేసిన అనుభవం లేదు. ఎటువంటి భద్రతా పరికరాలను, శిక్షణను అందించకుండా నేరుగా పని అప్పగించినందుకు ఫుడ్ స్టాల్ యజమాని సచిన్ కొతేకర్‌పై పోలీసులకు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా, ఆ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: రామ.. రామ.. ఇదెక్కడి దారుణం.. హనుమాన్ ఛాలీసాకు బార్ గర్ల్స్ డ్యాన్స్ చూస్తే..


Viral Video: అదృష్టం అంటే ఇతడిదే.. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఎలా బయటపడ్డాడో చూడండి..


Picture puzzle Test: మీ బ్రెయిన్ షార్ప్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలో తప్పేంటో వెతికి పట్టుకోండి..


Viral Video: కొండచిలువతో అటలాడితే అలాగే ఉంటుంది.. ఆ వ్యక్తి పరిస్థితి ఏం జరిగిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 17 , 2024 | 05:31 PM