Share News

Santa Claus: శాంటా క్లాజ్ ఎక్కడ ఉంటాడు? అతడికి ఉత్తరాలు రాయాలంటే అడ్రస్ ఏంటి?

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:42 PM

పిల్లలు, పెద్దలు అందరూ కలవాలని ఎదురు చూసే వ్యక్తి శాంటా క్లాజ్. శాంటా నుంచి తమకు ఏ బహుమతి కావాలో ప్లాన్ చేసుకుంటూ పిల్లలు ఏడాది పొడవునా వేచి చూస్తుంటారు. అతడికి ఉత్తరాలు రాసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, శాంటా ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు.

Santa Claus: శాంటా క్లాజ్ ఎక్కడ ఉంటాడు? అతడికి ఉత్తరాలు రాయాలంటే అడ్రస్ ఏంటి?
Santa Claus Address

క్రిస్మస్ (Christmas) పండుగ వచ్చేసింది. క్రిస్మస్ పండుగ అంటే చాలా మందికి గుర్తుకొచ్చే వ్యక్తి శాంటా క్లాజ్ (Santa Claus). పిల్లలు, పెద్దలు అందరూ కలవాలని ఎదురు చూసే వ్యక్తి శాంటా క్లాజ్. శాంటా నుంచి తమకు ఏ బహుమతి (Christmas Gifts) కావాలో ప్లాన్ చేసుకుంటూ పిల్లలు ఏడాది పొడవునా వేచి చూస్తుంటారు. అతడికి ఉత్తరాలు రాసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, శాంటా ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. కాబట్టి శాంటాకు ఉత్తరం పంపడం కష్టం. శాంటాను తమ పౌరుల్లో ఒకరిగా క్లెయిమ్ చేసుకోవడానికి అనేక దేశాలు పోటీ పడుతున్నాయి (Santa Claus Address).


ఫిన్లాండ్ పర్యాటక కేంద్రం అయిన లాప్‌ల్యాండ్‌.. శాంటా ఆడ్రస్ అని ఆ దేశ వాసులు క్లెయిమ్ చేస్తుంటారు. లాప్‌ల్యాండ్‌లో శాంటా తన వర్క్‌షాప్‌ని నిర్వహిస్తారని చెబుతుంటారు. అందులో ఎంత నిజముందో తెలియదు గానీ, శాంటా, లాప్‌ల్యాండ్ మధ్యన లింక్ వందల మిలియన్ల పర్యాటక డాలర్లను తెచ్చిపెడుతుంది. అలాగే స్వీడన్ కూడా శాంటా తమ దేశ పౌరుడని చెబుతుంటుంది. శాంటా థీమ్ పార్క్‌గా శాంటావరల్డ్‌ను నిర్మించింది.


ఈ ప్రదేశాలు శీతాకాలంలో తెల్లటి మంచుతో, రెయిన్ డీర్‌తో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. అయితే చాలా మంది శాంటా ఉత్తరధ్రువానికి చెందిన వ్యక్తి అని నమ్ముతారు. 19వ శతాబ్దం మధ్యలో, చిత్రకారుడు థామస్ నాస్ట్.. శాంటాను ఉత్తరధ్రువానికి చెందిన ఉల్లాసవంతమైన వృద్ధుడిగా చిత్రీకరించాడు. చాలా వరకు నాస్ట్ పెయింటింగ్ ఆధారంగానే శాంటా ఆహార్యాన్ని చాలా మంది ఫాలో అవుతుంటారు. శాంటా వస్త్రధారణ ఆధారంగా అతడు ఉత్తరధ్రువానికి చెందిన వ్యక్తి అని భావిస్తుంటారు.


ఇక, మధ్యయుగ పురాణాల ఆధారంగా శాంటా తమ వాడని ఫిన్లాండ్, స్కాండినేవియా దేశాలు ప్రయత్నిస్తుంటాయి. ఇక, కెనడా ప్రభుత్వం శాంటాను తమ గగనతలం గుండా ప్రయాణించడానికి అనుమతించడం ద్వారా ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ను ప్రారంభిస్తుంది. 2013లో స్టీఫెన్ హార్పర్ ప్రభుత్వం శాంటా, అతని భార్యకు కెనడియన్ పాస్‌పోర్ట్‌లను కూడా జారీ చేసింది. మొత్తానికి శాంటా తమ వాడని చెప్పుకోవడానికి చాలా దేశాలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఇది ఆల్టో కాదు.. మినీ థార్.. ఓ వ్యక్తి ఇంజినీరింగ్ ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


Picture Puzzle Test: ఈ ఫొటోలో తప్పేంటో 5 సెకెన్లలో కనిపెడితే.. మీ అబ్జర్వేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Viral Video: ఇది మామూలు ప్రాంక్ కాదు.. స్నేహితుడిని నమ్మినందుకు ఎలా మోసం చేశాడో చూడండి..


Viral Video: పల్లీలు అమ్ముకునే ఈ బాలిక ముందు గ్రాడ్యుయేట్లు కూడా దిగదుడుపే.. పాక్ బాలిక ఇంగ్లీష్ వినండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 25 , 2024 | 04:42 PM