Viral News: హవ్వా.. ఎంత దుర్మార్గం.. చపాతీలు రావడం ఆలస్యమైందని పెళ్లి క్యాన్సిల్.. విషయమేంటంటే..
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:21 PM
మగపెళ్లి వారిని తగిన రీతిలో గౌరవించాలనే సాంప్రదాయం చాలా మంది పాటిస్తుంటారు. అలా గౌరవ మర్యాదల తగిన రీతిలో లేకపోతే అలకలు, గొడవలు జరుగుతుంటాయి. కొందరు మానవత్వం లేని వ్యక్తులు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ఘటనే జరిగింది.
సాధారణంగా పెళ్లి (Wedding) అంటే సందడి, ఉత్సాహం మాత్రమే కాదు.. పంతాలు, పట్టింపులు కూడా ఉంటాయి. మగపెళ్లి వారిని తగిన రీతిలో గౌరవించాలనే సాంప్రదాయం చాలా మంది పాటిస్తుంటారు. అలా గౌరవ మర్యాదల తగిన రీతిలో లేకపోతే అలకలు, గొడవలు జరుగుతుంటాయి. కొందరు మానవత్వం లేని వ్యక్తులు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో అలాంటి ఘటనే జరిగింది. కేవలం చపాతీలు (Rotis) రావడం లేటైందనే కారణంతో పెళ్లినే రద్దు చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. వధువు తరఫు వారు వరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు (Viral News).
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లా హమీద్‌పూర్ గ్రామంలో ఓ వివాహ కార్యక్రమం జరుగుతోంది. రాత్రి భోజనాల సమయంలో వరుడి తరఫు వారు రోటీలు కావాలని అడిగారు. అయితే వెంటనే వాటిని వధువు తండ్రి ఏర్పాటు చేయలేకపోయాడు. దీంతో వరుడు మెహతాబ్‌కు తీవ్ర ఆగ్రహం వచ్చింది. పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి వెంటనే తన బంధువులతో కల్యాణ మండపం నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. వివాహ వేదిక వద్ద వరుడి కోసం వధువు ఎదురుచూస్తూ ఉండిపోయింది. విషయం తెలిసిన తర్వాత ఆమె హృదయం బద్దలైపోయింది. మరో రెండ్రోజులకే ఆ వరుడు మరో వివాహం చేసుకున్నట్టు తెలిసింది.
వధువు తరఫు కుటుంబం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. అయితే స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోవడం, వెంటనే చర్యలు తీసుకోకపోవడంతో వారు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. తాము వరుడికి కట్నంగా రూ.1.5 లక్షలు ఇవ్వడమే కాకుండా, పెళ్లికి రూ.7 లక్షలు ఖర్చు పెట్టామని ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వరుడి కుటుంబలోని ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీకు లాలీపాప్ అంటే ఇష్టమా?.. ఈ ఐస్‌క్రీమ్‌ల మధ్య అదెక్కడుందో కనిపెట్టండి..
Shocking: ఇదెక్కడి విచిత్రం.. పక్షి కడపులో నుంచి బయటపడుతున్న చేప.. అసలేం జరిగిందంటే..
Viral News: బెడ్‌షీట్‌పై కాఫీ చుక్కలు.. కస్టమర్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన హోటల్ సిబ్బంది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి