Share News

Viral Video: ఈ దొంగ మామూలోడు కాదు.. కళ్ల ముందే రూ.5 లక్షల బంగారాన్ని ఎలా కొట్టేశాడో చూడండి..

ABN , Publish Date - Sep 02 , 2024 | 02:35 PM

మన దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిని సురక్షితంగా ఉంచాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దానిని పోగొట్టుకుని బాధితులుగా మారాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో మరింత భద్రంగా దాచుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Viral Video: ఈ దొంగ మామూలోడు కాదు.. కళ్ల ముందే రూ.5 లక్షల బంగారాన్ని ఎలా కొట్టేశాడో చూడండి..
Pune Couple Stops for Vada Pav, Loses Rs 5 Lakh Worth of Jewellery to Thief.

మన దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిని సురక్షితంగా ఉంచాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దానిని పోగొట్టుకుని బాధితులుగా మారాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో మరింత భద్రంగా దాచుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా పుణె (Pune)లో పట్టపగలు నడిరోడ్డుపై ఒక దొంగ (Thief) చాలా సులభంగా దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారు నగలు (Gold)కొట్టేశాడు. ఆ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


పుణెకు చెందిన వృద్ధ దంపతులు గత గురువారం ఉదయం బ్యాంకులోని తమ నగలను విడిపించుకుని స్కూటీ మీద ఇంటికి వెళ్తున్నారు. ఆ నగలు ఉన్న సంచని భద్రంగా దాచకుండా స్కూటీకి తగిలించారు. మార్గమధ్యంలో ఓ షాప్ దగ్గర ఆగి వడపావ్ కొనడానికి భర్త వెళ్లగా.. భార్య స్కూటీ దగ్గర నిలబడి ఉంది. వారిని గమనిస్తున్న దొంగ ఆ నగల బ్యాగ్ కోసం స్కూటీ దగ్గర కాసేపు నిలబడ్డాడు. ఆమె స్కూటీ వెనక్కి వెళ్లగానే ఆ దొంగ ఆ నగల బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయాడు. గమనించిన వృద్ధురాలు అరవడం ప్రారంభించింది. అక్కడ జనం గుమిగూడే లోపు ఆ దొంగ వెళ్లిపోయాడు.


ఈ ఘటన మొత్తం ఆ షాప్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @satyaagrahindia అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``విలువైన వస్తువులు ఉన్నప్పుడు అంత అజాగ్రత్తగా ఉంటారా``, ``వడపావ్ కంటే బంగారం చాలా విలువైందని వారు తెలుసుకుంటారు``, ``రూ.5 లక్షల బంగారాన్ని స్కూటీ బయట అలా వదులుగా వేలాడదీస్తారా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: రూల్స్ పాటించకపోతే అలాగే ఉంటుంది.. సింహం ఏం చేసిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!


Brain Teaser: కేవలం 1 శాతం మందే సరైన జవాబు చెప్పారు.. ఈ ఫొటోలోని వ్యక్తుల్లో ఎవరు సేఫ్..!


Viral Video: రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.. ఓ ట్రక్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..


Picture Puzzle: ఈ పజిల్‌లో ``Hero``ను కనిపెడితే మీరు నిజమైన హీరోనే.. 5 సెకెన్లలో పూర్తి చేయండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2024 | 02:35 PM