Share News

Viral Video: హఠాత్తుగా బ్రేకులు ఫెయిల్.. డ్రైవర్ తెలివిగా ఎంత పెద్ద ప్రమాదం నుంచి రక్షించాడో చూడండి..

ABN , Publish Date - Dec 29 , 2024 | 08:24 PM

ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల కూడా ప్రమాదాలు ఎదురవుతుంటాయి. అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అయితే యాక్సిడెంట్లు తప్పవు. అయితే అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా డ్రైవర్లు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఆ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: హఠాత్తుగా బ్రేకులు ఫెయిల్.. డ్రైవర్ తెలివిగా ఎంత పెద్ద ప్రమాదం నుంచి రక్షించాడో చూడండి..
Road Accident Video

సాధారణంగా అతి వేగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరుగుతుంటాయి. అయితే ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల కూడా ప్రమాదాలు ఎదురవుతుంటాయి. అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ (Brakes Fail) అయితే యాక్సిడెంట్లు తప్పవు. అయితే అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా డ్రైవర్లు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఆ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు ఆ ట్రక్ డ్రైవర్‌పై (Truck Driver) ప్రశంసలు కురిపిస్తున్నారు (Viral Video).


aryantyagivlogs అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ భారీ ట్రక్ వేగంగా వస్తుండగా హఠాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. టోల్ గేట్ దగ్గరకు రాగానే ఆ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ ఆ ట్రక్కును టోల్ గేట్ దగ్గర డివైడర్‌ పైనుంచి పోనిచ్చాడు. దీంతో ఆ ట్రక్కు వేగం కాస్తా తగ్గింది. ఆ తర్వాత ట్రక్కు ఇంజిన్ పక్కకు తిరిగి టోల్ బూత్‌ను ఢీకొని ఆగిపోయింది. డ్రైవర్ అలా చేయకపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం కూడా సంభవించేది. ఆ ఘటన టోల్ గేట్ దగ్గర అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించి లైక్ చేశారు. డ్రైవర్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు కురిపించారు. ``అంత విపత్కర పరిస్థితుల్లో కూడా డ్రైవర్ చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు``, ``ఆ డ్రైవర్ చాలా చక్కగా ఆలోచించాడు``, ``అంత పెద్ద ప్రమాదం జరిగినా తక్కువ నష్టంతో బయటపడ్డాడు`` అంటూ డ్రైవర్‌ను నెటిజన్లు ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వధువు మెడలో దండ వేస్తుండగా షాకింగ్ సీన్.. వెనుక నుంచి వచ్చిన అమ్మాయి ఒక్క తన్ను తంతే..


Viral Video: హృదయ విదారకం.. కళ్ల ముందే చిన్నారి మాయం.. వరద నీటిలో ఎలా పడ్డాడో చూడండి..


Viral Video: వావ్.. పులులు కూడా ఇలా ప్రవర్తిస్తాయా? ఓ వ్యక్తి యాక్షన్‌కు పులి రియాక్షన్ చూస్తే..


Viral News: హవ్వా.. ఎంత దుర్మార్గం.. చపాతీలు రావడం ఆలస్యమైందని పెళ్లి క్యాన్సిల్.. విషయమేంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 29 , 2024 | 08:24 PM