Viral Video: రోడ్డుపై డెత్ స్టంట్.. డబుల్ డెక్కర్ బైక్ స్టంట్ చూస్తే చెమటలు పట్టడం ఖాయం..
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:45 PM
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రమాదకర సాహసాలు చేసేందుకు చాలా మంది రంగంలోకి దిగుతున్నారు. రోడ్లుపై స్టంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాలో పాపులర్ కావడం అనేది ప్రస్తుతం చాలా మందికి మొదటి ప్రాధాన్యంగా మారింది. అందుకోసం వారు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రమాదకర సాహసాలు చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. రోడ్లుపై స్టంట్లు చేస్తున్నారు (Dangerous Stunts). ఈ క్రమంలో కొందరు తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే షాక్ అవడం ఖాయం (Viral Video).
artist.bs_yt అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొందరు యువకులు బైక్‌ను వెరైటీగా మార్చారు. స్ప్లెండర్ బైక్‌కు ఇనుప చట్రాలు బిగించి పైన ఇద్దరు కూర్చునేందుకు వీలుగా రూపొందించారు. ఆ బైక్ మీద మొత్తం నలుగురు కూర్చున్నారు. ఆ బైక్ మీద వర్షపు నీటితో నిండిన గుంటలు ఉన్న గ్రామీణ రోడ్లపై రైడింగ్‌కు వెళ్లారు. ఓ నీటి గుంత నుంచి పైకి వచ్చే క్రమంలో బైక్ కాస్త అదుపు తప్పింది. ముందు టైర్ గాల్లోకి లేచింది. అయితే అదృష్టవశాత్తూ ఆ బైక్ బ్యాలెన్స్ కోల్పోకుండా రోడ్డు పైకి వచ్చింది. ఆ స్టంట్‌ను వేరే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. 38 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది అత్యంత ప్రమాదకరం``, ``అంత పై నుంచి పడితే కోలుకోవడం కష్టం``, ``రీల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం``, ``ఆ బైక్ మీద ఓ వ్యక్తి పడుక్కోవచ్చు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అదేంటి.. కారును ఇలా కూడా డెకరేట్ చేస్తారా? ఆ కారును చూస్తే నవ్వాపుకోవడం కష్టం..
Viral Video: బ్యాడ్ లక్ అంటే ఇదే.. అమెరికాలో ఇంజనీరింగ్.. ఇండియాలో అడుక్కుంటున్నాడు..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి