Viral: అప్పుడే పుట్టిన మనవడిని చూడగానే అత్తకు డౌట్.. కోడలికి బలవంతంగా డీఎన్‌ఏ టెస్టు చేయిస్తే..
ABN , Publish Date - Apr 09 , 2024 | 04:36 PM
కోడలు కొడుకును మోసం చేస్తోందని డౌటొచ్చిన ఓ అత్త ఆమెకు డీఎన్ఏ టెస్టు చేయించి తనే ఇబ్బందుల్లో పడింది. తన కాపురమే కూలిపోయే వింత స్థితికి చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: కోడలు అక్రమసంబంధం పెట్టుకుందని డౌట్ పడ్డ అత్త ఆమెకు డీఎన్ఏ టెస్టు చేయించి చివరకు తనే ఇబ్బందుల్లో పడింది. తన కాపురమే కూలిపోయే వింత స్థితికి చేరుకుంది. తమ కుటుంబంలో పరిస్థితిని వివరిస్తూ ఆ కోడలు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా (Viral) మారింది.
ఇటీవల ఓ విదేశీ యువతి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, చిన్నారి కళ్లు లేత ఆకుపచ్చ రంగులో ఉండటంతో యువతి అత్తకు డౌటొచ్చింది. తమ కుటుంబంలో ఎవరికీ ఆ రంగు కళ్లు లేకపోవడంతో కోడలికి అక్రమ సంబంధం ఉందని అత్త నిర్ధారణకు వచ్చేసింది. ఆపై రోజూ కోడలిని వేధించసాగింది. కొడుకు మాత్రం తన భార్యకే మద్దతుగా నిలిచాడు. ఆమె తనను ఎన్నటికీ మోసం చేయదని తల్లికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ మాటలేవీ పట్టించుకోని అత్త తన కోడలిని రోజూ సూటిపోటి మాటలతో వేధించసాగింది (This is What Happened When This Mother-in-law Asked Daughter-in-law To Take DNA ).
Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో
ఈ వివాదానికి శాశ్వతంగా ముగింపు పెట్టాలనుకున్న కోడలు చివరకు డీఎన్ఏ టెస్టుకు అంగీకరించింది. అయితే టెస్టు ఫలితాలతో కథ ఊహించని మలుపు తిరిగింది. కోడలి బండారం బయటపడుతుందనుకుంటే అత్త వయసు వేడిలో ఉన్నప్పుడు చేసిన తప్పు బట్టబయలైంది. తన మనవడి తండ్రి తన కొడుకే అయినా అతడి తండ్రి మాత్రం తన భర్త కాదని బయటపడటంతో అత్త షాకైపోయింది. మనవడి కంటి రంగు.. ఇతర కుటుంబసభ్యులు అందరికంటే భిన్నంగా ఉండటానికి కారణం ఇదేనని తేలిసి నిర్ఘాంతపోయింది.
ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్న కోడలు తనకు ఇప్పుడేం చేయాలో తోచట్లేదని చెప్పుకొచ్చింది. తన భర్త అసలు తండ్రి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని వెల్లడించింది. నెటిజన్లు మాత్రం ఆ ప్రయత్నాలను కట్టిపెట్టాలని సూచించారు. కుటుంబం పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు విషయాన్ని ఇక్కడితో మర్చిపోవాలని చెప్పారు.
Viral: అసలే కన్ఫ్యూజన్‌లో ఉన్న అడవి దున్నను రెచ్చగొట్టేసరికి..
Viral: అర్ధరాత్రి విమానం దిగిన మహిళ..ఎయిర్‌పోర్టులో క్యాబ్ బుక్ చేస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి