Pressure Cooker: మనం అన్నం వండుకునే ప్రెషర్ కుక్కర్ చరిత్ర ఏంటో తెలిస్తే..
ABN , Publish Date - Nov 16 , 2024 | 10:38 PM
దాదాపు ప్రతి వంటింట్లో కనిపించేవి ప్రెషర్లు కుక్కర్లు. మనకెంతో సాధారణమైనవిగా కనిపించే ఈ ప్రెషర్ కుక్కర్ల వెనక దాదాపు 350 ఏళ్ల చరిత్ర ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు ప్రతి వంటింట్లో కనిపించేవి ప్రెషర్లు కుక్కర్లు. మనకెంతో సాధారణమైనవిగా కనిపించే ఈ ప్రెషర్ కుక్కర్ల వెనక దాదాపు 250 ఏళ్ల చరిత్ర ఉందని పరిశీలకులు చెబుతున్నారు. 17వ శతాబ్దంలో దీన్ని కనుగొనగా ఆ తరువాత వినియోగదారుల అవసరాలకు అనుగూణంగా దీని డిజైన్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి (Viral).
1679లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త డెనిస్ పాపిన్ దీన్ని కొనుగొన్నారు. మొదట్లో దీన్ని ఇనుప గిన్నితో రూపొందించారు. గిన్నెపై గట్టిగా పట్టుకుని ఉండే మూత ఉండేది. అప్పట్లో ప్రెషర్ కుక్కర్‌ను మెడికల్ పరికరాలు స్టెరిలైజ్ (సూక్ష్మక్రిములను పూర్తిగా నిర్మూలించేందుకు) వినియోగించే వారు. అప్పట్లో దీన్ని డైజెస్టర్ అని పిలిచేవారు.
Mike Tyson: మైక్ టైసన్ జీవితంలో ఆసక్తికర ఘటన! భారీ మగ గొరిల్లాతో ఫైట్‌కు సిద్ధమై..
అయితే, 1800ల్లో ప్రెషర్ కుక్కర్ డిజైన్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కుక్కర్లు పేలిపోకుండా ఉండేందుకు సేఫ్టీ వాల్స్ ఫీచర్ జతకూడింది. లోపలి నీటి ఆవిరి కారణంగా ఒత్తిడి పెరిగిపోయినప్పుడు సేఫ్టీ వాల్వ్ తెరుచుకుని ఆవిరి మొత్తం బయటకు పోతుంది. కుక్కర్ పేలకుండా ఉంటుంది.
తరువాతి కాలంలో దీని డిజైన్‌లోని మరిన్ని మార్పులు చోటుచేసుకోవడంతో రకరకాల సైజుల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. మొదట్లో కుక్కర్లను ఇనుముతో చేసినప్పటికీ తరువాతి కాలంలో అల్యూమినియంతో కూడా చేయడం ప్రారంభించారు. ఆ తరువాత క్రమంగా స్టీల్ కుక్కర్లు కూడా వినియోగంలోకి వచ్చాయి. భిన్న రకాల లోహాలతో చేసిన కుక్కర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగం పెరుగుతోంది.
Aadhaar Misuse: మీ ఆధార్ మరెవరైనా వాడుతున్నారని డౌటా? ఇలా చేస్తే సరి
కుక్కర్ పనితీరు ఇలా..
కుక్కర్ మూత నిరంతరం మూసి ఉండటంతో అందులో ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. సాధారణ పీడనం వద్ద నీరు 100 డిగ్రీల వద్ద ఆవిరిగా మారితే కుక్కర్‌లో వేడి 120 డిగ్రీల వరకూ చేరుకుంటుంది. ఫలితంగా కుక్కర్‌లోని ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఇంధన వినియోగం తగ్గుతుంది. కుక్కర్‌లో వండిన ఆహారంలో పోషక విలువలుగా కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అధిక పీడనం కారణంగా కుక్కర్‌లోని ఆహారంలోగల సంక్లిష్ట పదార్థలు సరళమైన రసాయనాలుగా మార్పు చెందుతాయి. దీంతో, పోషకాలు మరింతగా అందుబాటులోకి వస్తాయి. కుక్కర్ మూసి ఉండటంతో ఇవన్నీ బయటకు వెళ్లే దారిలేక ఆహారంలోనే ఉండిపోతాయి. ఫలితంగా ఫుడ్‌లోని పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Viral: టాలెంట్ ఉన్నా లైఫ్‌లో ముందుకెళ్లట్లేదా? కారణాలు ఇవే!