Share News

Viral Video: డాక్టర్ అంటే ఎవరు? పరీక్ష పేపర్‌లో ఓ కుర్రాడు రాసిన జవాబు చూస్తే నవ్వాపుకోలేరు..

ABN , Publish Date - Dec 23 , 2024 | 08:51 PM

కొందరు డాక్టర్ల తీరు వల్ల పవిత్రమైన ఆ వృత్తి పట్ల చిన్న పిల్లలకు కూడా చులకన భావం ఏర్పడింది. డాక్టర్లు అంటే దేవుళ్లు అనే రేంజ్ నుంచి, జాలి లేని వ్యాపారస్తులు అనే రేంజ్‌కు వెళ్లిపోయింది. తాజాగా ఓ పరీక్షలో విద్యార్థి రాసిన జవాబు చూస్తే నిజమే అనిపించకమానదు. ఆ పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Viral Video: డాక్టర్ అంటే ఎవరు? పరీక్ష పేపర్‌లో ఓ కుర్రాడు రాసిన జవాబు చూస్తే నవ్వాపుకోలేరు..
Viral Answer Sheet

గతంలో చిన్న వయసు పిల్లల్ని పెద్దయ్యాక ఏం అవుతావని అడిగితే.. చాలా మంది పిల్లలు ``డాక్టర్`` (Doctor) అనే సమాధానం చెప్పేవారు. అయితే కొందరు డాక్టర్ల తీరు వల్ల పవిత్రమైన ఆ వృత్తి పట్ల చిన్న పిల్లలకు కూడా చులకన భావం ఏర్పడింది. డాక్టర్లు అంటే దేవుళ్లు అనే రేంజ్ నుంచి, జాలి లేని వ్యాపారస్తులు అనే రేంజ్‌కు వెళ్లిపోయింది. తాజాగా ఓ పరీక్షలో విద్యార్థి (Student) రాసిన జవాబు చూస్తే నిజమే అనిపించకమానదు. ఆ పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు కూడా అదే తరహాలో తమ స్పందనలను తెలియజేశారు. ఆ ఫన్నీ ఆన్సర్ షీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Answer Sheet).


@VishalMalvi అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ ఆన్సర్ షీట్ షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ ఆన్సర్ షీట్ ప్రకారం.. ``డాక్టర్ అంటే ఎవరు`` అనే ప్రశ్నకు ఓ విద్యార్థి తనదైన శైలిలో ఫన్నీ సమాధానం ఇచ్చాడు. ``డాక్టర్ అంటే.. పిల్స్ (మాత్రలు)తో మీ జబ్బులను చంపి, తర్వాత బిల్స్‌తో మిమ్మల్ని చంపే వ్యక్తి`` అని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం చూసిన టీచర్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు ఐదుకు ఐదు మార్కులు వేసి ఆ ఆన్సర్ షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఆన్సర్ షీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ ఆన్సర్ షీట్‌ను ఇప్పటివరకు 6.2 లక్షల మందికి పైగా వీక్షించారు. 15 వేల మందికి పైగా ఆ ట్వీట్‌ను లైక్ చేశారు. ఆ కుర్రాడి జవాబుతో చాలా మంది ఏకీభవించారు. `` ఈ పిల్లలే నేటి కాలానికి నిజమైన తత్వవేత్తలు``, ``ఆ ప్రశ్నకు దీనికి మించిన సరైన జవాబు లేదు.. అందుకే ఆ టీచర్ పూర్తి మార్కులు వేశారు``, ``మన దేశంలో ఆరోగ్య సంరక్షణపై చేస్తున్న ఖర్చు గురించి ఇది చేదు నిజం``, ``సోదరా.. ఇది నిఖార్సైన నిజం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఎదుటి వారికి హాని చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో చూస్తే..


Viral Video: వామ్మో.. ఇతడు యమధర్మరాజు చుట్టంలా ఉన్నాడే.. చిచ్చు బుడ్డిని ఎలా కాలుస్తున్నాడో చూడండి..


Viral Video: వామ్మో.. టైర్ పేలితే ఎఫెక్ట్ ఇలా ఉంటుందా? ఆ వ్యక్తి గాల్లోకి ఎలా ఎగిరిపడ్డాడో చూడండి..


Viral Video: కారు ముందుకు వెళ్లకుండా చుట్టుముట్టిన ఆవులు.. ఆసలేం జరిగిందో తెలిస్తే.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 23 , 2024 | 08:51 PM