Viral Video: ఎదుటి వారికి హాని చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో చూస్తే..
ABN , Publish Date - Dec 23 , 2024 | 06:51 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది గంటల కొద్దీ సమయాన్ని దానికే వెచ్చిస్తున్నారు. కావాల్సినంత వినోదాన్ని పొందుతున్నారు. దీంతో చాలా మంది తమ క్రియేటివిటీని ఉపయోగించి వీడియోలు రూపొందించి వారిని ఎంటర్‌టైన్ చేస్తున్నారు.
ప్రస్తుతం చేతిలో స్మార్ట్‌ఫోన్ లేని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేని వ్యక్తులు చాలా చాలా అరుదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది గంటల కొద్దీ సమయాన్ని దానికే వెచ్చిస్తున్నారు. కావాల్సినంత వినోదాన్ని పొందుతున్నారు. దీంతో చాలా మంది తమ క్రియేటివిటీని ఉపయోగించి వీడియోలు రూపొందించి వారిని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్నో ఫన్నీ వీడియోలు (Funny Video) జనాలను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు (Viral Video).
@aaris_786 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక మహిళ ఆరు బయట కూర్చుని మొహం కడుక్కుంటోంది. ఆ సమయంలో ఆమె భర్త మెల్లిగా వచ్చి పక్కనే ఉన్న టవల్‌కు నల్ల రంగు పూస్తాడు. ఆ టవల్‌తో తన భార్య తుడుచుకుంటే ఆమె మొహం నల్లగా మారుతుందని అలా చేశాడు. తర్వాత ఆమె ముందుకు వచ్చి కూర్చున్నాడు. మొహం కడుక్కున్న నీటిని ఆ మహిళ ముందుకు విసిరేసింది. దీంతో ఆ నీళ్లు అతడిపై పడ్డాయి. ముందుగా కూర్చున్న భర్తపై నీళ్లు పడడంతో ఆ మహిళ కంగారు పడింది.
పక్కనే ఉన్న టవల్‌ను తీసి అతడి మొహాన్ని తుడవడానికి ప్రయత్నించింది. దీంతో అతడి మొహం అంతా నల్లగా మారిపోయింది. ఆ ఘటనను షూట్ చేసిన వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``కర్మ వెంటనే తిరిగి వస్తుంది`` అంటూ కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. ఇతడు యమధర్మరాజు చుట్టంలా ఉన్నాడే.. చిచ్చు బుడ్డిని ఎలా కాలుస్తున్నాడో చూడండి..
Viral Video: వామ్మో.. టైర్ పేలితే ఎఫెక్ట్ ఇలా ఉంటుందా? ఆ వ్యక్తి గాల్లోకి ఎలా ఎగిరిపడ్డాడో చూడండి..
Viral Video: కారు ముందుకు వెళ్లకుండా చుట్టుముట్టిన ఆవులు.. ఆసలేం జరిగిందో తెలిస్తే.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి