Share News

Contagious Yawning: ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తారు! ఎందుకో తెలిస్తే..

ABN , Publish Date - Dec 08 , 2024 | 02:26 PM

సాధారణంగా ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తుంటారు. ఇలా ఆవలింతలు ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుంటాయి. ఇలా ఎందుకో? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఈ కథనం మీ కోసం.

Contagious Yawning: ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తారు! ఎందుకో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తుంటారు. ఇలా ఆవలింతలు ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తుంటాయి. ఇలా ఎందుకూ? అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఈ కథనం మీ కోసమే. మనిషి మనుగడకు సంబంధించి ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. అందులో ఆవలింతలు కూడా ఒకటని చెప్పకతప్పదు. అలసిపోయినప్పుడో, నిద్ర ముంచుకొస్తున్నప్పుడో, లేదా ఏమీ తోచనప్పుడో ఆవలింతలు వస్తాయని అనుకుంటాం గానీ అది పూర్తిగా నిజం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రక్రియ అంత కంటే సంక్లిష్టమైనదని చెబుతున్నారు (Viral).

ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం, ఆవలింతలు మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఉద్దేశించినవి. మెదడు తీవ్రంగా పని చేస్తున్నట్టు ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆవలింతలు వేడిని తగ్గిస్తాయి. మెదడు చల్లబడేలా చేస్తాయి. ఇక ఎండాకాలంలో కంటే చలికాలంలోనే ఆవలింతలు ఎక్కువ వస్తాయి. చలి వాతావరణంలో శరీరానికి ఎక్కువ ఆక్సీజన్ కావాల్సి రావడంతో ఇలా ఆవలించి ఎక్కువగా గాలి పీల్చుకుంటామన్నమాట.

Viral: 50 ఏళ్ల క్రితం డైవర్స్.. ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లిచేసుకోనున్న వృద్ధ జంట!


ఇక ఆవలింతలు ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తాయో తెలుసుకునేందుకు మ్యూనిచ్‌లోని సైకియాట్రిక్ యూనివర్సిటీ ఆసుపత్రి 2004లో ఓ అధ్యయనం నిర్వహించింది. మొత్తం 300 మంది పాల్గొన్న ఈ అధ్యయనంలో కనీసం 50 శాతం మంది ఆవలిస్తున్న వారిని చూశాక వారూ ఆవలించారట. మెదడులోని మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ కారణంగా ఇతరులను అనుకరించేందుకు మనుషులు సిద్ధమవుతారని, ఆవలింతల విషయంలో కూడా ఇదే వ్యవస్థ క్రియాశీలకమవుతుందని పరిశోధకులు తేల్చారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. ఇదో రకమైన సామాజిక మిమిక్రీ అని వ్యాఖ్యానించారు. మెదడులోని ఈ న్యూరాన్ల కారణంగానే ఆవలిస్తున్న వారిని చూసినప్పుడు మనకూ అసంకల్పితంగా అవి వస్తాయట.

Viral: మంచనా 85 ఏళ్ల వృద్ధుడు! పక్కనే నిలబడి 22 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ డ్యాన్స్!


ఆవలింతల వెనక సామాజిక బంధాలు పెంపొందించుకునే కోణం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అవతలి వారి పరిస్థితికి సులువుగా స్పందించే వారే ఇలా ఇతరులను చూసి ఆవలిస్తారని కూడా పరిశోధకులు తేల్చారు. మానవ పరిణామక్రమంలో భాగంగా ఆవలింతలు వ్యక్తుల మధ్య బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఉనికిలోకి వచ్చి ఉండొచ్చని అంటున్నారు. ఒకరి చూసి మరొకరు స్పందించేందుకు వీలుగా మానవ మెదడు నిర్మితమైందని, ఇందులో భాగంగానే ఆవలింతలను చూడాలని చెబుతున్నారు. ఆవలింతలు గురించి ఆలోచించినా అవి వస్తాయంటే ఈ సైకలాజికల్ వ్యవస్థ ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు.

ఈ పరిస్థితి అందరిలో ఒకేలా ఉండదని కూడా పరిశోధకులు గుర్తించారు. అవతలి వారిని చూస్తే ఆవలింతలు వస్తాయా లేదా అనేది ఆయా వ్యక్తుల వయసు, భావోద్వేగాల తీరుతెన్నులు, ఇతర మానసిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ఇలా వ్యాపించే ఆవలింతల వెనక కారణమేంటని తెలియకపోయినా వీటి మూలాలు మాత్రం మనిషి సామాజిక నైజంలో ఉందని ఘంటా పథంగా చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ తీరు స్నేహితులు, తెలిసిన వారి మధ్య ఎక్కువగా కనిపిస్తుంటుంది కాబట్టి సామాజిక కోణం ఉందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ఈ దిశగా 2020లో జరిగిన ఓ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మావటి ఆవలిస్తుంటే చూసిన ఏనుగులు అవి కూడా ఆవలించడం ప్రారంభించాయట. మావటితో ఓ అనుబంధం ఉండటంతోనే ఏనుగులకూ ఆవలింతలు వచ్చాయని ప్రతిపాదిస్తున్నారు. సో.. అందండీ.. ఆవలింతల వెనకున్న సామాజిక కోణం!

Read Latest and Viral News

Updated Date - Dec 08 , 2024 | 02:35 PM