Viral: బిస్కెట్లల్లో రంధ్రాలు ఎందుకుంటాయో తెలుసా?
ABN , Publish Date - Dec 03 , 2024 | 02:34 PM
బిస్కెట్లలో రంధ్రాలు ఎందుకుంటాయనే సందేహం బిస్కట్స్ తినే ప్రతి ఒక్కరికీ ఎప్పుడోకప్పుడు కలిగే ఉంటుంది. సాధారణ బిస్కెట్స్ మొదలు, క్రాకర్స్, బర్బన్స్ వరకూ అన్నింట్లో ఇవి కనిపిస్తుంటాయి. అయితే, వీటి వెనక పెద్ద కారణమే ఉందని బిస్కెట్ల తయారీదార్లు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బిస్కెట్స్ అంటే ఇష్టపడే వాళ్లు ఎందరో ఉంటారు. కరకరలాడే బిస్కెట్స్‌లో టీలో ముంచి తింటే ఆ మజానే వేరని కొందరు మైమరిచిపోతూ చెబుతారు. ఇక బిస్కెట్లలో రంధ్రాలు ఎందుకుంటాయనే సందేహం బిస్కట్స్ తినే ప్రతి ఒక్కరికీ ఎప్పుడోకప్పుడు కలిగే ఉంటుంది. సాధారణ బిస్కెట్స్ మొదలు, క్రాకర్స్, బర్బన్స్ వరకూ అన్నింట్లో ఇవి కనిపిస్తుంటాయి. అయితే, వీటి వెనక పెద్ద కారణమే ఉందని బిస్కెట్ల తయారీదార్లు చెబుతున్నారు (Viral).
Viral: సూపర్ మార్కెట్లో బాలిక రచ్చ.. షాకింగ్ వీడియో వైరల్
బిస్కెట్లు ఆకర్షణీయంగా కనబడేందుకు రంధ్రాలు ఏర్పాటు చేసి ఉంటారని కొందరు భావిస్తుంటారు గానీ అది పూర్తిగా నిజం కాదని బిస్కెట్ల తయారీదారుల చెబుతున్నారు. వాస్తవానికి వీటిని డాకర్ హోల్స్ అని పిలుస్తారట. ఈ రంధ్రాల కారణంగానే బిస్కెట్స్‌ను అన్ని వైపులా ఒకే విధంగా బేక్ చేయడం సాధ్యమవుతుందట. బిస్కెట్ తయారీ సందర్భంగా వాటి ఆకృతి చెడిపోకుండా ఉండేందుకు ఈ డాక్టర్ హోల్స్ పెట్టడం అత్యవసరమని చెబుతున్నారు.
Tattoo: తొలిసారి టాటూ వేయించుకుంటున్నారా?ఈ విషయాల గురించి ఆలోచించారా?
బేకింగ్ సందర్భంగా జనించే ఆవిరి ఈ రంధ్రాల మీదుగా బయటకు పోతుంది. ఇవే లేకపోతే ఆవిరి మొత్తం బిస్కెట్లలోనే ఉండిపోతుంది. ఫలితంగా వాటి ఉపరితలం కొన్ని చోట్ల ఉబ్బినట్టుగా తయారవుతుంది. కొన్ని సందర్భాల్లో బేకింగ్ ఒకేలా జరగక బిస్కెట్లు విరిగిపోతాయి. దీని వల్ల అవి చూడటానికి ఆకర్షణీయంగా కూడా కనిపించవు. బిస్కెట్లలో రంధ్రాలు ఏర్పాటు చేయడం ద్వారా అవి పూర్తిగా బేక్ అయ్యేలా తయారీదార్లు చూస్తారు.మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. బిస్కెట్ సైజును బట్టి ఈ రంధ్రాలు ఎన్నెన్ని ఎక్కడెక్కడ ఉండాలో కచ్చితత్వంతో లెక్కించి ప్రత్యేక యంత్రాల సాయంతో ఏర్పాటు చేస్తారు. దీంతో, బిస్కెట్ చివర్ల నుంచి మధ్య వరకూ అంతటా ఒకేలా బేక్ అయ్యి రుచి అద్భుతంగా కుదురుతుందట.
Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా! చెడామడా విమర్శించిన నెటిజన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్
క్రాకర్స్ లాంటి బిస్కెట్లలో డాకర్స్ పాత్ర మరింత కీలకమని కూడా తయారీదార్లు చెబుతున్నారు. క్రాకర్స్‌లోని రంధ్రాల గుండా గాలి బయటకు పోవడంతో లోపలు ఎటువంటి బుడగలు ఏర్పడవు. ఫలితంగా ఇవి బాగా కరకరలాడేలా సిద్ధమవుతాయి. అయితే, బర్బన్ లాంటి బిస్కెట్లలో మాత్రం ఈ డాకర్స్ అలంకారం కోసమే ఏర్పాటు చేస్తారని కూడా తయారీదార్లు చెబుతున్నారు. అయితే, ఒక్కో బిస్కెట్‌లో ఎన్ని రంధ్రాలు ఏర్పాటు చేయాలనేది పిండి కలిపిన తీరును బట్టి ఉంటుందట. పలచగా కలిపిన పిండితో చేసే బిస్కెట్లను ప్రత్యేకమైన మూసలో పోసి రంధ్రాలు ఏర్పడేలా చేస్తే గట్టిగా కలిపిన పిండికి డాకర్ రోలర్స్ సాయంతో రంధ్రాలను ఏర్పాటు చేస్తారు. మరి ఇప్పుడు అర్థమైందా.. బిస్కెట్ తయారీ వెనక ఎంత సూక్ష్మమైన అంశాలు ఉన్నాయో!