Share News

Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?

ABN , Publish Date - Sep 13 , 2024 | 08:52 PM

నౌకాయానానికి సంబంధించిన సంప్రదాయాల్లో అనేకం వైమానిక రంగంలో కొనసాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా విమానం డోర్లు ఎప్పుడూ ఎడమ వైపునే అమర్చుతారని చెబుతున్నారు.

Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణం సాధారణ అంశంగా మారిపోయిన జమానా ఇది. రెండు వేలు పెడితే విమానం ప్రయాణం ఎంజాయ్ చేయొచ్చు. ఇక విమానాల్లో ఎంట్రీ డోర్స్ అన్నీ ఎడమ వైపే ఉంటాయి. తరచూ విమానప్రయాణాలు చేసే వారు ఈ విషయాన్ని గమనించే ఉంటారు కానీ దీనికి కారణం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే, దీనివెనకున్న ఆసక్తికర చరిత్రను తాజాగా ఓ కంటెంట్ క్రియేటర్ నెట్టింట పంచుకున్నాడు. అతడు చెప్పింది నిజమేనని విమానయాన నిపుణులు కూడా అంగీకరిస్తుండటంతో ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్ (viral) అవుతోంది.

Viral: సముద్రంలో కూలనున్న ఇంటిని రూ.3 కోట్లకు కొన్న వ్యక్తి! ఎందుకంటే..


డగీ షార్పీ అనే టిక్‌టాక్ క్రియేటర్‌ ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. విమానాలకు సాధారణంగా ఎంట్రీ డోర్లు ఎడమవైపే ఉండటానికి చారిత్రాత్మక కారణాలను వెల్లడించాడు. విమానాలు అందుబాటులోకి రాక పూర్వం ప్రజలు సుదూర ప్రయాణాలకు ఎక్కువగా నౌకలపై ఆధారపడే వాళ్లు. అప్పట్లో నౌకల నుంచి సరుకులు మనుషులు దిగేందుకు వీలుగా వాటి ఎడమవైపు తలుపులను పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా నౌకాయానానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కాలక్రమంలో ఈ సంప్రదాయాన్ని అన్నీ దేశాలు అనుసరించడం ప్రారంభించాయి. దీంతో, నౌకకు ఎడవైపు భాగానికి పోర్టు సైడ్ అన్న పేరు స్థిరపడింది. అంటే పోర్టుకు (నౌకాశ్రయానికి) దగ్గరగా ఉండే వైపు అని అర్థం. ఇక నౌకల్లో స్టీరింగ్ వీల్‌ను కుడివైపు అమర్చడంతో స్టార్ బోర్డు అన్న పేరు వచ్చింది (Why Do You Always Board Planes From Left Side).

Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మరో సూచన.. విమర్శలు మళ్లీ షురూ!


ఇక విమానయానాలు అందుబాటులోకి వచ్చాక నిపునులు నౌకల్లో అనుసరిస్తున్న పద్ధితినే అవలంబించాలని నిర్ణయించారు. తద్వారా తికమకకు తావులేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రమాణిక పద్ధతి అవలంబించినట్టు అవుతుందని భావించారు. దీంతో, విమానాల్లో కూడా నౌకల మాదిరిగానే ఎడమవైపు తలుపులు ఏర్పాటు అయ్యాయి. ప్రయాణికులు ఎడమవైపు నుంచే ఎక్కిదిగేందుకు వీలుగా ప్రతి ఎయిర్ పోర్టు, ప్రతి విమానంలో ఏర్పాట్లు ఉంటాయని ఏవియేషన్ నిపుణులు అంగీకరిస్తున్నారు. ఇది నౌకాయానం నుంచి అందిపుచ్చుకున్న సంప్రదాయమని చెబుతున్నారు. దీంతో పాటు విమానయాన రంగంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న పదజాలంలో అధిక శాతం నౌకారంగం నుంచి అప్పు తెచ్చుకున్నదేనని కూడా నిపుణులు చెబుతున్నారు.

Viral: డైవర్స్ తీసుకున్న మహిళ రెండో పెళ్లికి పెట్టిన కండీషన్స్.. జనాలకు షాక్!

Read Latest and Viral News

Updated Date - Sep 13 , 2024 | 08:57 PM